ఫార్ములా వన్ రేసుల గురించి తెలియని వారు ఉండరు. రెప్పపాటు వేగంలో దూసుకెళ్లే కార్లను అబ్బురంగా చూస్తూండిపోతూ ఉంటారు. ఇలాంటి రేసులు ఢిల్లీలో జరిగినప్పుడు దేశమంతా సంబరమే. ఇప్పుడు అలాంటి రేసులకు హైదరాబాద్ వేదిక అవబోతోంది. అయితే ఇవి ఫార్ములా వన్ కాదు. ఫార్ములా -ఈ. అంటే ఎలక్ట్రిక్ కార్ల రేసులన్నమాట. వీటిని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఫార్ములా ఇ అసోసియేషన్, తెలంగాణ, గ్రీన్‌కో సంస్థల మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. హైదరాబాద్‌లోని కాకతీయ హోటల్‌లో ఈ కార్యక్రమం జరిగింది.


 






Also Read: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..


    
ఫార్ముల వన్‌ రేసింగ్‌ నిర్వహించాలంటే ప్రత్యేకంగా ట్రాక్‌ అవసరం. కానీ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌తో నిర్వహించే పోటీలకు ప్రత్యేక రేసింగ్‌ ట్రాక్‌ అక్కర్లేదు. హైదరాబాద్‌లో ఉన్న రోడ్లు విశాలంగా ఉంటాయి. ఆ పోటీలు జరిగినప్పుడు ట్రాఫిక్‌ను నిలిపివేస్తే సాఫీగా సాగిపోతాయి. నెక్లస్‌రోడ్డు - ట్యాంక్‌బండ్‌ సర్క్యూట్‌, కేబీఆర్‌ పార్కు, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లు సరిపోతాయని అంచనాకు వచ్చారు. ఇంకా ఎక్కడైనా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలంటే.. ఆ మేరకు చేసిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. టోర్నీ నిర్వహణకు అవసరమైన కొన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. 


Also Read: TS Cabinet: రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ, థియేటర్లపై ఆంక్షలు ఉంటాయా? నేడే కేబినెట్ భేటీ


ఇ వన్‌​ ఫార్ములా ఛాంపియన్‌షిప్‌ పోటీలు 2014 నుంచి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు లండన్‌, న్యూయార్క్‌, మెక్సికో, రోమ్‌, బెర్లిన్‌, రోమ్‌, సియోల్‌, వాంకోవర్‌ వంటి నగరాల్లో నిర్వహించారు. తొమ్మిదో సీజన్‌కి సంబంధించిన పోటీలకు సౌదీ అరేబియాలోని దిరియా నగరం వేదికగా నిలిచింది. ఇప్పుడు ఆ అవకాశం హైదరాబాద్‌కు దక్కింది. 


Also Read: Bhatti Vikramarka: సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకి కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన


ఇ వన్‌ ఫార్ములా పోటీలు నిర్వహించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవ చూపించారు. రేస్‌కి ఆతిధ్యం ఇచ్చేందుకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాలు సైతం పోటీ పడ్డాయి. అయితే ఇక్కడ ప్రభుత్వం చూపిన చొరవ, స్థానిక పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో చివరకు హైదరాబాద్‌ ను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఫార్ములా - ఈ రేసింగ్‌లో ఆనంద్ మహింద్రా వంటి వారికి కూడా టీములు ఉన్నాయి. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి