Bhatti Vikramarka Tested Covid Positive: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనంతరం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి, పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గతంలో కరోనా సోకిన వారికి సైతం కొవిడ్ సోకుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు కొవిడ్19 నిబంధనలు ఉల్లంఘిస్తూ కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది.
తనకు కరోనా పాజిటివ్ అని, కొవిడ్19 బారిన పడ్డట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యలు చెప్పడంతో హోం క్వారంటైన్ లో ఉన్నారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఇటీవల తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కాంగ్రెస్ కీలక నేత సూచించారు. కరోనాను జయించి, క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన పార్టీ కార్యకర్తలను, మద్దతుదారులను కలుస్తానని భట్టి విక్రమార్క ప్రకటించారు.
తెలంగాణలో కరోనా కేసులు..
రాష్ట్రంలో 55,883 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. కొత్తగా 2,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ముగ్గురు మృతి చెందారు. కరోనా నుంచి మరో 2,013 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 22,048 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కరోనా రోజువారి పాజిటివిటీ రేటు రాష్ట్రంలో పెరుగుతోంది.
మరోవైపు కరోనా వ్యాప్తిని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం జనవరి 17న కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. రేపు కేబినెట్ భేటీలో కరోనా వ్యాప్తి, కట్టడి, ప్రస్తుత పరిస్థితులపై చర్చ జరగనుందని తెలుస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యా సంస్థలకు జనవరి 30 వరకు సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకుంది. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం కరోనా బారిన పడ్డారు.
Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే
Also Read: D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!