దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. గోవాలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గోవాలో ఆమ్‌ఆద్మీ పార్టీని గెలిపించాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న కేజ్రీవాల్.. తిరిగి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు.
శివసేన విమర్శలు..
అరవింద్ కేజ్రీవాల్.. గోవాలో ఇంటింటి ప్రచారం నిర్వహించడంపై శివసేన విమర్శలు చేసింది. దిల్లీలో కరోనా కేసులు పెరుగుతోంటే సీఎం కేజ్రీవాల్ గోవాలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.
గోవాలో ఆప్ అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1000 అందజేస్తామని హామీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే గృహ ఆధార్ ఆదాయాన్ని నెలకు 1,500 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచుతామన్నారు.
Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 2.71 లక్షల మందికి కరోనా.. 8 వేలకు చేరువలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: 1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి