హైదరాబాద్‌‌లోని రాజేంద్రనగర్‌లో యువతి మృతదేహం కలకలం కలకలం రేపింది. అత్తాపూర్ చింతల్ మెట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి వెళ్లి చూసిన పోలీసులు షాకయ్యారు. గుర్తు తెలియని యువతి శవమై కనిపించింది. ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకున్నట్లుగా పోలీసులు చూశారు. యువతి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


ఆ వివరాలిలా ఉన్నాయి.. రాజేంద్రనగర్‌లో అత్తాపూర్ చింతల్ మెట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌‌లో అర్యాన్ ఖాన్‌ నివాసం ఉంటోంది. ఆమె బ్యూటీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఓ ప్లాట్ నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి రాజేంద్రనగర్ పోలీసులు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు చేరుకున్నాయి. తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడా ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకున్నట్లుగా ఓ యువతి కనిపించింది.


అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు మరిన్న వివరాల కోసం ఫ్లాట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అదే గదిలో ఇటీవల ఇరామ్ ఖాన్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నట్లు అపార్ట్‌మెంట్ ను పరిశీలిస్తే తేలింది. వారం రోజుల కిందట బ్యూటీషియన్ అర్యాన్ ఖాన్ చనిపోయి ఉండొచ్చునని ప్రాథమికంగా పోలీసులు, టీమ్ భావించింది. పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న ఇరామ్ ఖాన్ ఎవరు, అసలేం జరిగింది అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అపార్ట్‌మెంట్ లో ఉన్న సీపీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.
Also Read: Booster Dose: కోవిడ్ వ్యాక్సిన్‌ - బూస్టర్ డోస్‌‌కు తేడా ఏమిటీ? ఎవరు అర్హులు? ఏది బెస్ట్?


ప్రియుడితో సహజీవనం..
యువతిది హత్యా.. ఆత్మహత్యా అనే విషయంపై ఆరా తీస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు ఓ షాకింగ్ విషయం తెలిసింది. బ్యూటీషియన్ అర్యాన్ ఖాన్‌తో పాటు ఆ ఫ్లాట్‌లో ఓ యువకుడు ఉంటున్నాడని తెలుసుకున్నారు. గత కొంతకాలం నుంచి బ్యూటీషియన్ ఓ యువకుడితో సహజీవనం చేస్తోందని.. అయితే ప్రస్తుతం యువకుడు ఎక్కడ ఉన్నాడనే దానిపై పోలీసులు ఫోకస్ చేశారు. ఒకవేళ యువతి ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆమె ప్రియుడు పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేయకుండా ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్లిపోయాడనే కోణాల్లోనూ విచారణ కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు బ్యూటీషియన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫ్లాట్‌లో ఓ యువకుడితో సహజీవనం చేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.


Also Read: గొంతులు కోస్తున్న చైనా మాంజా.. నిషేధం విధించినా జోరుగా అమ్మకాలు ! ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి ?


Also Read: Weather Updates: ఏపీకి తప్పని కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములు కూడా.. తెలంగాణలో వెదర్ ఇలా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి