ప్రపంచానికి రెండు కోవిడ్ వ్యాక్సిన్ లు అందించిన దేశం భారత్ అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రపంచానికి భారత్‌ను ఆరోగ్య దర్శినిగా నిలెబెట్టిన మహనీయుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. కోవిడ్-19 వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ అగ్రరాజ్యాలలో భారతదేశం అగ్రగామిగా నిలిచిందన్నారు.


దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 156 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చామని, 18 ఏళ్లకు పై జనాభాలో 70 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ లు కేంద్ర ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు. బూస్టర్ డోస్ ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని.. అయినా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. వ్యాక్సిన్ల పంపకం ప్రారంభించి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.







ఏపీలో కరోనా వ్యాప్తి..
రాష్ట్రంలో 24 గంటల్లో 35,673 మందికి కరోనా పరీక్షలు చేయగా 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు. మరో 397 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. విశాఖ జిల్లాలో 1,103, చిత్తూరు 1,039, శ్రీకాకుళం 385, గుంటూరు 377, తూర్పు గోదావరి 327, అనంతపురం జిల్లాలో 300 కరోనా కేసులు చొప్పున నమోదయ్యాయి.


Also Read: Booster Dose: కోవిడ్ వ్యాక్సిన్‌ - బూస్టర్ డోస్‌‌కు తేడా ఏమిటీ? ఎవరు అర్హులు? ఏది బెస్ట్? 


గతంలో ఒకట్రెండు పర్యాయాలు కరోనా బారిన పడిన వారికి సైతం మళ్లీ కరోనా సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాలని కొవిడ్19 నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా బారిన పడ్డారు.


Also Read: గొంతులు కోస్తున్న చైనా మాంజా.. నిషేధం విధించినా జోరుగా అమ్మకాలు ! ఇంకెంత మంది ప్రాణాలు పోవాలి ?


Also Read: Weather Updates: ఏపీకి తప్పని కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములు కూడా.. తెలంగాణలో వెదర్ ఇలా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి