మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ముందుగా ఫిబ్రవరి 4న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు చెప్పిన టైంకి రావడం లేదని సంక్రాంతి రోజు అఫీషియల్ గా వెల్లడించారు. 


దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' ఇలా క్రేజీ ప్రాజెక్ట్ లన్నీ ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు 'ఆచార్య'ను కూడా పోస్ట్ పోన్ చేయడం మెగాభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. క‌రోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని త‌మ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం లేద‌ని పేర్కొంది. కొత్త విడుద‌ల తేదీని త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని తెలియ‌జేసింది.

 

తాజాగా కనుమ పండగ సందర్భంగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది చిత్రబృందం. ఉగాది కానుకగా ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఏప్రిల్ 1న మహేష్ బాబు 'సర్కారు వారి పాట' విడుదల కావాల్సింది కానీ ఆ సినిమా ఆగస్టుకి వెళ్లిందని సమాచారం. అందుకే ఆ డేట్ న మెగాస్టార్ రావడానికి రెడీ అవుతున్నారు. 

 

ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. రామ్ చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్నారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతం కావ‌డం అనే అంశంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మిక్స్ చేసి సినిమాల‌ను తీయ‌డంలో కొరటాలకు మంచి పేరుంది. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి!






 


 


 


 


 


 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి