సినిమా: హీరో
రేటింగ్: 2.75/5
నటీనటులు: అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, రవికిషన్, సత్య, 'వెన్నెల' కిషోర్, బ్రహ్మాజీ తదితరులు
ఆర్ట్ డైరెక్టర్: ఎ. రామాంజనేయులు
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్
సంగీతం: జిబ్రాన్
నిర్మాణ సంస్థలు: అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: పద్మావతి గల్లా
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య .టి
విడుదల తేదీ: 15-01-2022
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ కథానాయకుడిగా పరిచయమైన సినిమా 'హీరో'. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. తనకు సినిమా విపరీతముగా నచ్చిందని మహేష్ బాబు చెప్పారు. అశోక్ ఐదేళ్ల నుంచి చాలా కష్టపడ్డాడని తెలిపారు. అశోక్ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందా? సంక్రాంతికి విడుదలైన కృష్ణ, మహేష్ బాబు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. మరి, 'హీరో' ఎలా ఉంది?
కథ: అర్జున్ (అశోక్ గల్లా) హీరో అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. తమ అపార్ట్‌మెంట్‌లో కొత్తగా వచ్చిన సుబ్బు అలియాస్ సుభద్ర (నిధి అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన సుబ్బు తండ్రి (జగపతి బాబు)... హీరోగా ట్రై చేస్తున్న అర్జున్‌కు తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు. ఆయన్ను కన్వీన్స్ చేయాలని అనుకుంటున్న అర్జున్‌కు... తనకు కాబోయే మామను చంపడానికి ముంబై మాఫియా నుంచి హైదరాబాద్ రౌడీలకు సుపారీ అందిందని తెలుస్తుంది. సుబ్బు తండ్రిని చంపాలనుకున్నది ఎవరు? ఆయన్ను అర్జున్ ఎలా కాపాడాడు? సుబ్బు తండ్రి ముంబైలో ఏం చేశాడు? ముంబై పోలీసులకు మోస్ట్ వాంటెడ్ డాన్ అయిన సలీం భాయ్ (రవికిషన్) గన్ అశోక్ చేతికి ఎలా వచ్చింది? చివరకు, ఏమైంది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: హీరోగా తొలి సినిమాకు ప్రేమకథను ఎంపిక చేసుకున్న హీరోలు ఉన్నారు. మాస్ కమర్షియల్ సినిమా చేసినవాళ్లు ఉన్నారు. అశోక్ గల్లా ఆ రెండు జానర్ కథలు పక్కన పెట్టి... ఓ స్లాప్‌స్టిక్ కామెడీ కథను ఎంపిక చేసుకుని 'హీరో చేశారు. అందులో మాస్, కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకున్నారు. సాంగ్స్, ఫైట్స్, హీరో బిల్డప్ షాట్స్... సినిమాలో అన్నీ ఉన్నాయి. ఒక్క కథ మాత్రమే తక్కువగా ఉంది. కథ కంటే కామెడీ మీద దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఎక్కువ దృష్టి పెట్టారు. కామెడీ కంటే హీరో ప్రజెంటేషన్ మీద మరింత శ్రద్ధ వహించారు. అందువల్ల... 'హీరో' సినిమా హీరోగా అశోక్ గల్లాకు పర్ఫెక్ట్ లాంఛ్ అని చెప్పవచ్చు.
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
ఫస్టాఫ్‌లో పెద్దగా కథేమీ లేదు. కానీ, చకచకా ముందుకు వెళుతుంది. కౌబాయ్‌గా హీరో ఇంట్రడక్షన్, తర్వాత నిధి అగర్వాల్‌తో రొమాంటిక్ సీన్, హీరో చేతికి గన్ రావడం వంటివి చకచకా సాగుతాయి. సెకండాఫ్‌లో స్టోరీ మెయిన్ పాయింట్ రివీల్ అయిన తర్వాత కథనంలో వేగం తగ్గింది. సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. జగపతి బాబు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కొందరికి సిల్లీగా అనిపిస్తే... మరికొందరికి నవ్వు తెప్పించవచ్చు. స్లాప్‌స్టిక్ కామెడీని ఎంజాయ్ చేసే టేస్ట్‌ను బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. కథలో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే... సెకండాఫ్ మరీ స్లోగా సాగడం సినిమాకు మైనస్.
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంది. సినిమాటోగ్రఫీ బావుంది. ఛేజింగ్ సీన్స్‌లో హీరోను బాగా చూపించారు. జిబ్రాన్ సాంగ్స్ ఓకే. నేపథ్య సంగీతంతో సీన్స్ ఎలివేట్ చేయడానికి ఆయన చాలా ప్రయత్నించారు. ఎడిటింగ్ ఓకే. సీన్స్ లెంగ్త్ దర్శకుడు తగ్గించి ఉంటే బావుండేది. ఆర్ట్ వర్క్ పర్వాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ గ్రాండ్‌గా ఉన్నాయి.
Also Read: 'సూపర్ మచ్చి' రివ్యూ: సూపర్ అనేలా ఉందా? లేదా?
అశోక్ గల్లా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. తొలి సినిమా అయినా చాలా ఎనర్జీతో చేశాడు. డ్యాన్సులు, ఫైటుల్లో ఎంతో ఈజ్ కనిపించింది. నిధి అగర్వాల్ రోల్ చిన్నదే. ఆమె గ్లామర్‌తో ఆకట్టుకుంటారు. జగపతిబాబు, నరేష్, రవికిషన్ పాత్రలకు తగ్గట్టు చేశారు. క్లైమాక్స్‌లో బ్రహ్మాజీ రోల్... లౌక్యంలో 30 ఇయర్స్ పృథ్వీ రోల్‌ను గుర్తు చేస్తుంది. అయినా కామెడీ వర్కవుట్ అయ్యింది. అందులో బోయపాటి శ్రీను మీద పంచ్ డైలాగ్స్ వేశారు. 'వినయ విధేయ రామ'లో గద్దలు తల ఎత్తుకుపోయే సీన్ ప్రస్తావన తీసుకొచ్చారు. హీరో స్నేహితుడిగా ర్యాపర్ రోల్ చేసిన సత్య అంతగా నవ్వించలేదు. 'వెన్నెల' కిషోర్ రోల్ ఓకే. సినిమా ప్రారంభంలో 'సత్యం' రాజేష్ ఓ సన్నివేశంలో కనిపించారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సన్నివేశంలో నవ్వించారు.
Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
'హీరో' సినిమా అశోక్ గల్లాను హీరోగా ప్రాజెక్ట్ చేయడం కోసమే తీసినట్టు ఉంటుంది. కామెడీ, కమర్షియల్ సాంగ్స్, మాంచి ఫైట్స్... సినిమాను స్టయిలిష్‌గా తీశారు. కృష్ణ, మహేష్ బాబు అభిమానులకు సినిమాలో అభిమాన హీరో రిఫరెన్స్‌లు నచ్చుతాయి. కామెడీ సినిమాలు ఎంజాయ్ చేసే ప్రేక్షకులు హ్యాపీగా సినిమాకు వెళ్ళవచ్చు. హీరోగా అశోక్ గల్లా తొలి సినిమాతో మంచి మార్కులు వేయించుకుంటాడు.
Also Read: 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ: పప్పుచారు అంత టేస్టీగా... నవ్విస్తుంది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి