దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,71,202 కేసులు నమోదయ్యాయి. శనివారం కంటే 2,369 కేసులు ఎక్కువగా వచ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 15,50,377కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 16.28గా ఉంది. తాజాగా 1,38,331 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 95.51 శాతంగా ఉంది.







కరోనా కారణంగా ఒక్కరోజులో 314 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 4,86,066కు పెరిగింది.


మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. కొత్తగా 7,743 కేసులు నమోదయ్యాయి.


వ్యాక్సినేషన్..







భారత్​లో టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. శనివారం 66,21,395 డోసులు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,76,15,454కు చేరింది.


మహారాష్ట్ర..


మహారాష్ట్రలో కొత్తగా 42,462 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 2,64,441కి చేరింది.


కొత్తగా 125 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,730కి చేరింది. ముంబయిలో 11 మంది కరోనాతో మృతి చెందారు. ముంబయిలో కొత్తగా 11 మంది మృతి చెందారు. 


Also Read: గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ.. యూపీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ !


Also Read: ఎలక్షన్ టైం కదా.. రైతులు కొట్టినా తియ్యని దెబ్బే..! ఉత్తరాది బీజేపీ ఎమ్మెల్యేకు ఎంత కష్టమో...?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి