అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో సమంత చేసిన ఐటెం సాంగ్ ఇండియా వైడ్ వైరల్ అయింది. సమంత నటించిన ఈ పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 'ఊ అంటావా మావ ఊఊ అంటావా..?' అంటూ సాగే ఈ పాటను ఇంద్రావతి చౌహాన్ పాడింది. ఈ పాట మీద చాలా రీల్స్ వచ్చాయి. చాలా మంది కవర్ సాంగ్స్ కూడా చేశారు. 

 

బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి ఈ పాటను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించింది. సమంత వేసిన కాస్ట్యూమ్స్ లాంటివే ధరించి మాస్ స్టెప్పులేసింది. కానీ ఈ విషయంలో సమంతను ఎవరూ బీట్ చేయలేరనుకోండి. తాజాగా నటి ప్రగతి కూడా ఈ పాటకు స్టెప్పులేసింది. సినిమాల్లో అమ్మ, అత్త పాత్రలు పోషించే ప్రగతి రియల్ లైఫ్ లో మాత్రం చాలా హాట్ గా కనిపించడానికి ఇష్టపడుతుంది. 

 

ట్రెండీగా డ్రెస్ చేసుకుంటూ.. జిమ్ లో వర్కవుట్ చేస్తూ కనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు డాన్స్ వీడియోలను, తన వర్కవుట్ వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇప్పుడేమో 'ఊ అంటావా మావ ఊఊ అంటావా..?' పాటకు స్టెప్పులేసి నెటిజన్లను మెప్పించింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.