సాధారణంగా ఎవరైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నా చాలా మంది దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్తారు. అలాంటి స్పర్శ మనకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అలాంటిది హాగ్ చేసుకుంటే ఆ బలం మరింత రెట్టింపు అవుతుందట. అయితే ఈ హగ్ ఇబ్బందిలో ఉన్న వ్యక్తికే కాదు ఎదుట వ్యక్తికి కూడా ప్రయోజనకరమంటున్నారు పరిశోధకులు. శారీరక స్పర్శ ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. మనసును ప్రశాంత పరుస్తుంది. ఇది కౌగిలించుకున్న ఇద్దరికీ చక్కని ఔషధంగా పని చేస్తుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. అప్పటి వరకు మనలో ఉన్న ఒత్తిడి నుంచి రిలీఫ్ ఇస్తుంది. ఆరోగ్యకరమైన జీవితానికి బాటలు వేస్తుందని స్టడీస్ చెప్తున్నాయి.
కౌగిలింత చిన్నారులను బ్రెయిన్‌ను షార్ప్ చేస్తుంది
పిల్లులు ఎదిగే సమయంలో ఈ హగ్ చాలా ప్రయోజనకరమంటున్నారు పరిశోధకులు. తరచూ వాళ్లను కౌగిలించుకుంటూ ఉంటే వాళ్ళ శారీరక, మానసిక ఎదుగుదల చాలా బాగుంటుదట. కౌగిలింత పిల్లల్లో పాజిటివ్‌నెస్ పెంచుతుంది. ఆ దిశగా బ్రెయిన్‌ను ట్రైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. కౌగిలింతకు నోచుకోని అనాథలపై అధ్యయనం చేస్తే వాళ్ల మానసిక శారీరక అభివృద్ధిపై చాలా ప్రభావం ఉన్నట్టు తేల్చారు. వారిలో మానసికంగా, శారీరకంగా కుంగుబాటు కనిపించినట్టు గుర్తించారు. శిశువు పుట్టిన పదివారాల్లో దీని ప్రభావం ఎక్కువ ఉంటుందట.
రోజుకు నాలుగు హగ్‌లు తప్పనిసరి
చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ల అభివృద్ధికి కూడా కౌగిలింతలు అవసరం. ఓ మనిషి ప్రశాంతంగా జీవితాన్ని లీడ్ చేయాలంటే రోజూ లెక్కలేనన్ని హగ్‌లు ఉండాలని వర్జీనియాకు చెందిన ఓ థెరపిస్టు స్టడీలో తేలింది. అందుకే ఆమె చెప్పిన వివరాల ప్రకారం మనిషి బతకడానికి నాలుగు హగ్‌లు అవసరమని... రోజూవారి పనులు సక్రమంగా చేయాలంటే ఎనిమిది, సక్రమమైన వృద్ధి కోసం 12 కౌగిలింతలు అవసరమని ఆమె పేర్కొన్నారు.
కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి కౌగిలింత చాలా అవసరమని ఆమె పరిశోధనలో తేలింది. ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్‌లో మనిషికి రోజుకు నాలుగు కౌగిలింతలు అవసరమని తెలిపారామె.
ఒక్క కౌగిలింత వంద భావాలకు సమానం.
మన మనసులోని భావాలను అవతలి వ్యక్తి చెప్పలేని టైంలో కౌగిలింత సమాచార సాధనంగా పని చేస్తుంది. కౌగిలింతలో ఓదార్పును పొందుతాం. అందుకే చిన్నపిల్లలు భయపడినా... ఆందోళనలో ఉన్నా ఏడుస్తున్నా ముందుగా తల్లిదండ్రులు వారిని కౌగిలించుకుంటారు. అంటే వారికి నేను ఉన్నానని చెప్తూ ధైర్యం ఇవ్వడమన్నమాట. ఇది వయసుతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. కౌగిలింత మనపై ఇతరులకు నమ్మకాన్ని కలిగిస్తుంది. వాళ్లను దగ్గరకు చేర్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇతరలకు మనపై నమ్మకం కలిగేలా అర్థమయ్యేలా చెప్పే పదాల కంటే ఒక్క కౌగిలింత ఇద్దర్నీ దగ్గరకు చేరుస్తుంది. చెప్పలేని ఎన్నో భావాలను తెలియజేస్తుంది.
అయితే కౌగిలింత టైంలో మీరు తాకే బాడీ పార్ట్స్ మీ మనసులోని భావాలను అవతలి వ్యక్తికి చేర వేస్తుంది. ఒక్కో పార్టు ఒక్కో భావానికి ప్రతీకలు.
గుండె ఆరోగ్యాన్ని పెంచే హగ్
రక్తపోటును నియంత్రించడంలో కౌలిగింతది కీలక పాత్ర ఉందట. తరచూ కౌగిలించుకునే రొమాంటిక్ దంపతులకు గుండెజబ్బులు తక్కువ వస్తాయని స్టడీస్ చెప్తున్నాయి.
రోజూ ఓ హగ్ చేసుకోండి... డాక్టర్‌కు దూరంగా ఉండండి అనేది ఇప్పుడు కొత్త సామెత. హగ్ చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇలా విడుదలైన హార్మోన్.. దెబ్బలను త్వరగా తగ్గేలా చేస్తుంది. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్న వాళ్లు... ఇతరులతో గుడ్ ర్యాపో కలిగి ఉన్న వాళ్లు ఎక్కువ కౌగిలింతలు ఇస్తుంటారని అలాంటి వారి వ్యాధినిరోధ శక్తి ఎక్కువగా ఉంటుందట. అలాంటి వారు జలుబు, జ్వరం లాంటి చిన్న రోగాలు ఎక్కువ ఇబ్బంది పడబోరని పేర్కొంటున్నాయి పరిశోధనలు. ఇతరులతో పోలిస్తే వాళ్లు త్వరగా కోలుకుంటారని కూడా చెప్తున్నాయి.
Also Read: Booster Dose: కోవిడ్ వ్యాక్సిన్ - బూస్టర్ డోస్‌కు తేడా ఏమిటీ? ఎవరు అర్హులు? ఏది బెస్ట్?
Also Read: రాత్రికి రాత్రి వింతగా మారిపోయిన ఇసుక.. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఫొటోలు వైరల్