నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సంబరాల కోసం తన సోదరి పురందేశ్వరి ఇంటికి వెళ్లారు. కుటుంబ సమేతంగా ప్రకాశం జిల్లా కారంచేడుకు వెళ్లిన బాలయ్య.. రెండు రోజులుగా అక్కడే సందడిగా గడుపుతున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శనివారం గుర్రం ఎక్కి హంగామా చేశారు బాలయ్య. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ గుర్రాన్ని బాలయ్య ఆడించిన విధానం.. ఆయనతో పాటు కొడుకు మోక్షజ్ఞ కూడా కనిపించడంతో అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేశారు.
ఇక ఆదివారం ఉదయం చీరాల బీచ్‌లో హల్‌చల్ చేశారు బాలయ్య. ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా చీరాల బీచ్ కు వెళ్లారు బాలయ్య. ఈ సందర్భంగా బాలకృష్ణ బీచ్ లో జీప్‌ను నడిపారు. భార్య వసుంధర ముందు సీట్ లో కూర్చోగా.. బాలయ్య వేగంగా జీప్‌ను డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో బాలయ్య తన భార్యపై సెటైర్లు వేస్తూ కనిపించారు.
ఇటీవల 'అఖండ' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి 'జై బాలయ్య' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ పోషిస్తుంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా కనిపించనున్నారు.