లెజెండరీ సింగర్, నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారతరత్న లతా మంగేష్కర్(92) కరోనా బారిన పడ్డారు. దాంతో ఆమెను ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు కొన్నిరోజుల క్రితం ఈ విషయాన్ని ధృవీకరించారు. 

 

వారం రోజులు గడిచినా కానీ.. ఆమెని వైద్యులు డిశ్చార్జ్ చేయకపోవడంతో ఇంకా కోలుకోవాల్సి ఉందని తెలుస్తోంది. లతా మంగేష్కర్ కోలుకోవాలని అభిమానులు  దేవుడ్ని వేడుకోవాలంటూ ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ ప్రతీత్ సందాని తాజాగా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలోనే ఆమె ఉన్నారు. మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడే ఏం చెప్పినా కానీ అది తొందరపాటే అవుతుంది. త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఆమె ఆసుపత్రిలోనే మరో 10 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది' అని వెల్లడించారు. 

 

లతా మంగేష్కర్ సోదరి ఆశాభోంస్లే సైతం ఈ విషయంపై స్పందించారు. కరోనా పాజిటివ్ కావడంతో  అనుమతించడం లేదని అన్నారు. ఒక్కసారి హాస్పిటల్ కి వెళ్లినా కానీ కాంపౌండ్ లోకి అనుమతించలేదని.. కానీ ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపారు. 







 


 


 


 


 


 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి