మానసిక ఒత్తిడి, హింస... ఈ రెండూ బయటికి కనిపించని పెద్ద గాయాలు. వాటికి గురైన మహిళల్లో బ్రోకెన్ హార్ట్ అని పిలిచే గుండె పోటు వచ్చే అవకాశం ఉందని చెబుతోంది కొత్త అధ్యయనం. అతి భావోద్వేగాల మూలంగా ఈ బ్రోకెన్ హార్ట్‌ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఒంట్లో తలెత్తే హార్మోన్ల స్థాయులు కారణమని స్వీడన్ కు చెందిన కరోలిన్ స్కా ఇన్సిట్యూట్ చేసిన అధ్యయనంలో తేలింది. విపరీతమైన మానసిక ఒత్తిడే దీనికి కారణమని తేల్చింది. 


బ్రోకెన్ హార్ట్ లక్షణాలు...
బ్రోకెన్ హార్ట్ అనగానే ప్రేమ విఫలమై వచ్చే నొప్పి అనుకుంటారు చాలా మంది. కాదు గుండెల్లో భరించలేని బాధ ఎక్కువైనప్పుడు, ఆమె అధికంగా భావోద్వేగాలకు గురవుతుంది. ఏడుపు, అరవడం, తీవ్రంగా బాధపడడం లాంటివన్నీ తీవ్ర భావోద్వేగాల కిందకు వస్తాయి. అవి ఎక్కువైనప్పుడు బ్రోకెన్ హార్ట్ కలిగే అవకాశం ఉంది. బ్రోకెన్ హార్ట్ అనేది గుండె పోటులా అనిపిస్తుంది. ఛాతీనొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కలుగుతాయి. ఇది ధమనులు మూసుకుపోవడం వల్ల కలుగదు. మానసికంగా ఒత్తిడితో కూడిన సంఘటన వల్ల సంభవిస్తుంది. 


ఎలా తెలిసింది?
గుండెపోటుతో బాధపడుతున్న మహిళలపై పరిశోధన నిర్వహించారు అధ్యయనకర్తలు. వారిలో పదిశాతం మందిలో గుండె రక్తనాళాల్లో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. అంటే రక్తనాళాలు మూసుకుపోవడం, గడ్డలు కనిపించడం వంటివి. వీరిలో గుండె పోటుకు కారణం బ్రోకెన్ హార్ట్ లక్షణాలేనని తేల్చారు. అయితే దీని వల్ల గుండె పనితీరు మందగిస్తుంది. అయితే ఈ పరిస్థితిని తేలికగా తీసుకోకూడదు. చికిత్స అవసరం. 


Also read: రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రేమ పెళ్లి... 81వ పెళ్లిరోజు జరుపుకున్న ప్రపంచ వృద్ధ దంపతులు


Also read:  నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా మసాలా రైస్ చేసుకుంటే... అదిరిపోతుంది 


Also read: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మద్యం ఇది... వేదాలలో కూడా దీని ప్రస్తావన?



Also read: ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తింటే కళ్లద్దాల అవసరం రాదట... కంటిచూపును కాపాడే దివ్యౌషధాలు


Also read: పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఈ సమస్యలు తప్పవు, ముఖ్యంగా డయాబెటిక్ వారు...


Also read: నా పేరు కోవిడ్... నేను వైరస్‌ను కాను, పేరుతో ఆ కోటీశ్వరుడికి కష్టాలు





 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.