ప్రముఖ దర్శకుడు కృష్మవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మరాఠీలో విడుదలైన 'నట సామ్రాట్' సినిమాకి ఇది రీమేక్. సాధారణంగా అయితే దర్శకుడు కృష్ణవంశీ రీమేక్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపరు. సొంత కథలతోనే సినిమాలను రూపొందిస్తారు. కానీ 'నట సామ్రాట్' సినిమాను చూసిన ఆయన రీమేక్ చేయాలని ఫిక్సయిపోయారు. అంతగా అతడిని కదిలించిన సినిమా అది. 


చాలా కాలంగా ఫ్లాప్ లతో డీలా పడ్డ వంశీ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. 'నట సామ్రాట్' సినిమాలో నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. అలానే సినిమాలో మరో ముఖ్య పాత్ర ఒకటి ఉంటుంది. నానా పటేకర్ స్నేహితుడిగా మరాఠీలో విక్రమ్ గోఖలే నటించారు. ఆయనొక స్టేజ్ ఆర్టిస్ట్. నానా పటేకర్ తో పోటీ పడి నటించారాయన. కొన్ని సన్నివేశాల్లో ఆయన్ను డామినేట్ కూడా చేశారు. 


అలాంటి పాత్రకు ఎవరిని తీసుకోవాలనే విషయంలో కృష్ణవంశీ చాలా ఆలోచించారు. సీరియస్ గా ఎమోషనల్ గా సాగే ఆ పాత్ర కోసం బ్రహ్మానందాన్ని ఎంపిక చేశారు. పైగా ఈ సినిమాలో బ్రహ్మానందం కొత్త లుక్ తో కనిపించబోతున్నారు. నిజానికి ఈ పాత్రలో నటించడానికి ఓ సీనియర్ హీరో ఇంట్రెస్ట్ చూపించారట. కానీ కృష్ణవంశీ మాత్రం ఆ పాత్రకు బ్రహ్మానందాన్నే ఫిక్సయ్యారు. 


ఇటీవల ప్రకాష్ రాజ్, బ్రహ్మానందంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించారట దర్శకుడు కృష్ణవంశీ. ఆ సమయంలో బ్రహ్మానందం పెర్ఫార్మన్స్ చూసి కృష్ణవంశీ ఎమోషనల్ అయ్యారట. కట్ చెప్పగానే బ్రహ్మానందాన్ని పట్టుకొని ఏడ్చేశారట. ఈ సినిమా హిట్ అయితే గనుక ఆ క్రెడిట్ మొత్తం బ్రహ్మానందం కొట్టేస్తారంటూ తన టీమ్ లో వాళ్లకు చెబుతున్నారట కృష్ణవంశీ. 


Also Read: 'వారియర్' టైటిల్ కోసం ఇద్దరు హీరోల ఫైట్.. నెగ్గేదెవరో..?


Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..


Also Read: రిస్క్ తీసుకోనంటున్న జేజమ్మ.. షూటింగ్ ఆలస్యం..


Also Read: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు..? ఐటెం సాంగ్ వివాదంపై దేవిశ్రీ ఫైర్..


Also Read: ఆ డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..



 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి