కన్నడ ముద్దుగుమ్మ రష్మిక 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సక్సెస్ అవ్వడంతో ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంది. అతడి తక్కువ సమయంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. అంతేకాదు.. ఇండియన్ నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. 


అలానే ఎక్కువ సమయంలో జిమ్ లో గడుపుతూ.. పలు వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన జిమ్ ట్రైనర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతడిపై రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ మిస్ అయిందంటూ ఓ పోస్ట్ పెట్టింది. రష్మిక నటించిన 'పుష్ప' సినిమాలో 'సామీ' పాటకు చాలా మంది రీల్స్ చేస్తున్నారు. విదేశీయులు సైతం ఈ పాటకు స్టెప్పులేస్తూ వీడియోలను షేర్ చేస్తున్నారు. 


తాజాగా రష్మిక జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేతీ కూడా 'సామీ సామీ' పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన రష్మిక తన ట్రైనర్ పై సెటైర్ వేసింది. కుల్దీప్ జిమ్ లో ట్రైనింగ్  వర్కవుట్ సరిగ్గా చేయమంటూ టార్చర్ చేస్తుంటాడని.. వద్దన్నా కూడా చేయిస్తూ ఉంటాడని చెప్పింది. కుల్దీప్ ఇలా 'సామి' సాంగ్ కిస్టెప్పులు వేస్తాడని తెలిస్తే.. దగ్గరుండి ఆ స్టెప్పులు నేర్పిస్తూ.. మళ్లీ మళ్లీ చేయమని రివెంజ్ తీర్చుకునేదాన్ని అని.. ఆ ఛాన్స్ మిస్ అయ్యానని తెగ బాధపడిపోయింది రష్మిక.    








Also Read: రిస్క్ తీసుకోనంటున్న జేజమ్మ.. షూటింగ్ ఆలస్యం..


Also Read: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు..? ఐటెం సాంగ్ వివాదంపై దేవిశ్రీ ఫైర్..


Also Read: ఆ డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..