తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వంగలపూడికి చెందిన ఓ వ్యక్తి విషం తాగి, పిల్లలకూ తాగించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతనితోపాటు ఓ కొడుకు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. అతడితో పాటు పదేళ్ల కొడుకు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే, ఇలా భర్త ఆత్మహత్య చేసుకున్నందుకు గల కారణాన్ని పోలీసులు వివరించారు. 


తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకర ఫోటోలు ఫేస్‌బుక్ కనిపించడం వల్లే మనస్తాపానికి గురై ఇలా చేశానని బాధితుడు చెప్పినట్లుగా పోలీసులు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా వంగలపూడికి చెందిన 30 ఏళ్ల వివాహిత కువైట్‌లో ఉండి ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త స్వగ్రామం గోకవరంలో ఇద్దరు కుమారులు ఉంటున్నారు. మరో కుమార్తె అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి అప్పుడప్పుడు వెళ్లి పిల్లల్ని చూస్తుంటాడు. శనివారం సాయంత్రం పండగ పేరుతో వంగలపూడికి వచ్చిన తండ్రి తన ముగ్గురు పిల్లలను బయటకు తీసుకెళ్లాడు. ముందుగా తాను ఎలుకల మందు తాగేశాడు. తర్వాత ముగ్గురు పిల్లలతో తాగించాడు.


Also Read: ‘టెస్లాను తెచ్చేద్దాం కేటీఆర్ అన్నా..’ కేటీఆర్‌కు భలే మద్దతు.. విజయ్ దేవరకొండ, జెనీలియా సహా డైరెక్టర్స్ కూడా..


కొద్దిసేపటికి వారిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరి బాధితులను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా ఇద్దరు పిల్లలు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. పిల్లలు ఇద్దరూ మాట్లాడుతూ.. తమ తండ్రి ఎప్పుడూ తమను పట్టించుకోడని అన్నారు. అమ్మమ్మ ఇంటి వద్దే ఉండే తమను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాడని అన్నారు. పండక్కి వచ్చాడనుకుని బయటకు వెళ్దామంటే బయలుదేరామని అన్నారు. బలవంతంగా ఏదో చేదు మందు తమతో తాగించే ప్రయత్నం చేశాడని అన్నారు. తమ్ముడు తెలియకుండానే తాగేశాడని విలపించారు. చావుబతుకుల్లో ఉన్న పిల్లల తండ్రి ఆటో నడుపుతాడని, గతంలో చోరీలకు పాల్పడినట్లు గోకవరంలో కేసు కూడా నమోదై ఉందని ఎస్సై తెలిపారు.


Also Read: Bhatti Vikramarka: సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్కకి కరోనా పాజిటివ్.. టెస్టులు చేయించుకోవాలని వారికి సూచన


Also Read: Nellore: కోడి పెంట తరలింపు పేరుతో దిమ్మతిరిగే దందా.. ‘పుష్ప’ రేంజ్‌లో మాస్టర్ ప్లాన్లు, పక్క రాష్ట్రం నుంచి..


Also Read: D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి