'ఆంటీ లేదంటే అక్క... మిమ్మల్ని ఎలా పిలవాలి?' అని అనసూయను ఒకరు అడిగారు. ''ఏదీ వద్దు. నేను మీకు బాగా తెలియదు కాబట్టి... ఆంటీ లేదంటే అక్క అని పిలవద్దు. నువ్ అడిగింది ఏజ్ షేమింగ్ కిందకు వస్తుంది. దీన్ని బట్టి నీ పెంపకం మీద డౌట్ వస్తోంది'' అని ఆమె స్ట్రాంగ్‌గా చెప్పారు. అనసూయ ఆన్సర్ కొంత మందికి నచ్చలేదు. దాంతో ఎదురు ప్రశ్నించారు.


'ఒకరిని అక్క అని పిలవడం ఏజ్ షేమింగ్ కాదు. అలాంటప్పుడు కాంప్లిమెంట్స్ కూడా తీసుకోవద్దు' అని ఇంకొకరు అనసూయతో అన్నారు. దానికి ఆమె "బహుశా ఏజ్ షేమింగ్ కాకపోవచ్చు. అయితే... మీరు నా ఉద్దేశాన్ని మీరు గమనించాలి. నేను ఏం చెప్పానో మీకు బాగా తెలుసు. నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. నన్ను ఎవరు అక్క అని పిలవాలి? ఎవరు పిలవకూడదు? అనే విషయంలో వాళ్లిద్దరూ చాలా పొసెస్సివ్. ఇక... కాంప్లిమెంట్స్ తీసుకోవాలా? వద్దా? అనేది ఒకరి ఇష్టం కదా? ఒక నావ సముద్రం మీద ఈదగలదు. అదే నావ, సముద్రాన్ని తన లోపలికి రానిస్తే... మునిగిపోతుంది. అందువల్ల... జన సముద్రం నుంచి ఏది ఎంత కావాలో / తీసుకోవాలో నాకు తెలుసు" అని చెప్పారు.


ఒకరు బాగా లావు అయ్యావని కామెంట్ చేస్తే... అనసూయ థాంక్స్ చెప్పడం గమనార్హం. నెగెటివ్ ట్రోల్స్ అనేవి ఒకప్పుడు తనపై, తన ఫ్యామిలీపై ఎఫెక్ట్ చూపించేవని, ఇప్పుడు తామంతా స్ట్రాంగ్ అయ్యామని... ఎవరైనా ఎవరినైనా హర్ట్ చేస్తే, చివరకు వాళ్లే హార్ట్ అవుతారని, కర్మ అనేది ఒకటి ఉంటుందని అనసూయ అన్నారు.


'పుష్ప 2' సినిమాలో తన పాత్ర గురించి కూడా అనసూయ మాట్లాడారు. పూర్తి స్థాయి విల‌న్‌గా కనిపిస్తానా? లేదా? అన్నది సుకుమార్ కథ రాయడం బట్టి ఉంటుందని చెప్పారు. 'రంగస్థలం'లో రంగమ్మత్త, 'పుష్ప'లో దాక్షాయణి... రెండిట్లో ఓ క్యారెక్టర్ ఎంపిక చేసుకోమంటే 'సుక్కు సార్' అని ఆమె ఆన్సర్ ఇచ్చారు.


Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..
Also Read: సంక్రాంతి బరిలో మహేష్ బాబు vs రామ్ చరణ్?
Also Read: రామ్ క్యారెక్టర్, ఫ‌స్ట్‌లుక్‌ రివీల్ చేసిన లింగుస్వామి... సినిమా టైటిల్ ఇదే!
Also Read: పది రోజుల్లో సినిమా రిలీజ్... ఇప్పుడు హీరోయిన్‌కు క‌రోనా పాజిటివ్
Also Read: అల... హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ! అలా 'పుష్ప' క్రేజ్‌ను వాడేస్తున్నారు మరి!!
Also Read: నిర్మాతకు ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన కీర్తీ సురేష్... ఆ నిర్మాత ఎవరంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి