హీరోయిన్ డింపుల్ హయతి కరోనా బారిన పడ్డారు. వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'జర్రా జర్రా...' ఐటమ్ సాంగ్‌లో డాన్స్ చేసిన అమ్మాయి గుర్తు ఉన్నారా? ఆవిడ ఈవిడే. ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ సరసన 'ఖిలాడి' సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. అంత కంటే ముందు 'సామాన్యుడు'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అందులో విశాల్ సరసన హీరోయిన్‌గా నటించారు. ఈ నెల 26న ఆ సినిమా విడుదల కానుంది. సోలో హీరోయిన్‌గా నటించిన తెలుగు, తమిళ సినిమా విడుదలకు పది రోజుల ముందు ఆమె కరోనా బారిన పడ్డారు.

Continues below advertisement


"అందరికీ హాయ్... అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే, శనివారం నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. నేను బావున్నాయి. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అధికారుల సూచనల మేరకు హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నాను. డబుల్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. అందువల్ల, కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోండి. మాస్క్ లు ధరించండి. శానిటైజ్ చేసుకోండి. త్వరలో స్ట్రాంగ్‌గా తిరిగొస్తా" అని డింపుల్ హయతి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.





ఇటీవల డింపుల్ హయతి ఓ ఫొటోషూట్ చేశారు. బహుశా... ఆమెకు అక్కడ కరోనా సోకి ఉండవచ్చని సమాచారం. 'సామాన్యుడు' విడుదల సమయానికి కరోనా నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తొలుత రెండు మూడు చిన్న సినిమాల్లో ఆమె నటించారు. అయితే... 'సామాన్యుడు' ఆమెకు పెద్ద సినిమా. ఆ తర్వాత వచ్చే రవితేజ 'ఖిలాడి' భారీ సినిమా. ఇటీవల హిందీ సినిమా 'అతరంగి రే'లో ఓ పాత్రలో డింపుల్ హయతి కనిపించారు. 


Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... క‌రోనా బారిన మ‌రో సెల‌బ్రిటీ?
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: మాలీవుడ్ సూపర్ స్టార్ కి కరోనా పాజిటివ్..
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
Also Read: 'సూప‌ర్ మ‌చ్చి' రివ్యూ: సూప‌ర్ అనేలా ఉందా? లేదా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి