కరోనా కారణంగా ఈ ఏడాది, గత ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పెద్దగా పోటీ ఎదురు కాలేదు. గత ఏడాది అయితే... సంక్రాంతికి వారం ముందే రవితేజ 'క్రాక్' విడుదలైంది. ఆ తర్వాత సంక్రాంతికి రామ్ 'రెడ్', బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'అల్లుడు అదుర్స్' సినిమాలు వచ్చాయి. ఈ ఏడాది సంక్రాంతికి 'బంగార్రాజు' ఒక్కటే పెద్ద సినిమా. దాంతో పాటు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమైన 'హీరో', చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన 'సూపర్ మచ్చి' సినిమాలు వచ్చాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం పెద్ద సినిమాల మధ్య పోటీ ఉండొచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.


ఈ ఏడాది సంక్రాంతి సందడి ఇంకా పూర్తి కాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి గురించి అప్పుడే చర్చ మొదలైందా? అంటే... అయ్యిందని చెప్పాలి. సంక్రాంతికి ముందే 'రౌడీ బాయ్స్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్, శంకర్ కలయికలో నిర్మిస్తున్న సినిమా(RC15)ను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత 'దిల్' రాజు వెల్లడించారు. మహేష్ బాబు 28వ సినిమా (SSMB28)ను కూడా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే నిజమైతే... మహేష్, రామ్ చరణ్ సినిమాల మధ్య పోటీ తప్పదు. 
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ SSMB28ను నిర్మిస్తోంది. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. సంక్రాంతికి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అయినట్టు త్రివిక్ర‌మ్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేసి సంగీత దర్శకుడు తమన్ పేర్కొన్నారు. మరోవైపు రామ్ చరణ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు.


గతంలో ఓసారి సంక్రాంతికి మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలు సంక్రాంతి బరిలో పోటీ పడ్డాయి. 'వన్ నేనొక్కడినే', 'ఎవడు' సినిమాలు 2014 సంక్రాంతికి విడుదల అయ్యాయి. మహేష్ - 'దిల్' రాజు కాంబినేష‌న్‌లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. మహేష్ బాబు, రామ్ చరణ్... ఇద్దరికీ సంక్రాంతి బరిలో మంచి రికార్డ్ ఉంది. అలాగే, పండక్కి రెండు మూడు భారీ సినిమాలు విడుదలై విజయాలు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు కేసుల విజయాలు సాధించాలని ఆశిద్దాం. అయితే... 2020లో 'సరిలేరు నీకెవ్వరు', 'అల... వైకుంఠపురములో' విడుదలైనప్పుడు అభిమానుల మధ్య వసూళ్ల విషయంలో వార్ నడిచింది. నెక్స్ట్ ఇయర్ కూడా అది తప్పదేమో!? కరోనా కారణంగా విడుదల తేదీలు మారుతున్నాయి. అప్పటికి ప్లానులు, లెక్కలు మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.


Also Read: రామ్ క్యారెక్టర్, ఫ‌స్ట్‌లుక్‌ రివీల్ చేసిన లింగుస్వామి... సినిమా టైటిల్ ఇదే!
Also Read: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు..? ఐటెం సాంగ్ వివాదంపై దేవిశ్రీ ఫైర్..
Also Read: అల... హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ! అలా 'పుష్ప' క్రేజ్‌ను వాడేస్తున్నారు మరి!!
Also Read: ఆ డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: పది రోజుల్లో సినిమా రిలీజ్... ఇప్పుడు హీరోయిన్‌కు క‌రోనా పాజిటివ్
Also Read: నిర్మాతకు ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన కీర్తీ సురేష్... ఆ నిర్మాత ఎవరంటే?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి