Omicron Cases In India: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త శాంతించాయి. నిన్నటితో పోల్చితే 13,113 పాజిటివ్ కేసులు తక్కువ నమోదయ్యాయి. గత రెండు వారాలుగా ప్రతిరోజూ కరోనా కేసులు పెరుగుతున్నాయే, తప్ప తగ్గడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,58,089 (2 లక్షల 58 వేల 89)  మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 385 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. 


నిన్న ఒక్కరోజులో 1,51,740 (ఒక లక్షా 51 వేల 740) మంది కరోనాను జయించారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,56,341కు చేరుకుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 119.65 శాతానికి పెరిగింది. క్రితం రోజు కేసులను పరిశీలిస్తే నేడు మూడు లక్షలు దాటేలా కనిపించాయి. అనూహ్యంగా నిన్నటి కన్నా 13 వేల కేసులు తక్కువగా నిర్దారణ అయ్యాయి.


రోజువారీ పాజిటివిటీ రేటు: 119.65%
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు: 16,56,341
భారత్‌లో రికవరీ రేటు: 96.62 శాతం







8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనమోదైన వాటితో కలిపితే దేశంలోని మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 8,209కు చేరుకున్నాయి. కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోన్న క్రమంలో కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా, మరికొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ వైపు ఫోకస్ చేస్తున్నాయి. మహారాష్ట్ర, న్యూఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. కోవిడ్ నిబంధనలు కఠినంగా పాటించాలని కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. 


Also Read: Kurnool కలెక్టర్ పీఏని అని చెప్పి డబ్బులు డిమాండ్.. నిందితుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు 







158 కోట్ల డోసుల టీకాలు..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 158.12 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద మరో 13.79 కోట్ల డోసుల వరకు నిల్వ ఉన్నాయని తెలిపింది. 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లకు కొవిడ్ టీకాలు వేస్తున్నారు, 60 ఏళ్లు దాటిన వారికి సైతం బూస్టర్ డోస్ టీకాల పంపిణీ జరుగుతోంది.


Also Read: Nellore: కోడి పెంట తరలింపు పేరుతో దిమ్మతిరిగే దందా.. ‘పుష్ప’ రేంజ్‌లో మాస్టర్ ప్లాన్లు, పక్క రాష్ట్రం నుంచి..


Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి