ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా, సమాజ్‌వాదీ పార్టీలో హోరాహోరీ ప్రచారాలు చేస్తున్నాయి. అయితే భాజపా నుంచి 9 మంది ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరడంతో కాషాయ పార్టీ కేడర్‌లో కాస్త ఉత్సాహం తగ్గింది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. జనవరి 23 నుంచి అమిత్ షా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రచారం నిర్వహించనున్నారు.


ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కచ్చితంగా 300 సీట్లకు పైగా గెలుపొందుతుందని భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భాజపా నుంచి ఎంత మంది నేతలు బయటకు వెళ్లినా అది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపదని అంటున్నారు. గెలుపు గుర్రాలకే భాజపా టికెట్లు ఇస్తుందన్నారు.


403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 



  • మొదటి విడత: ఫిబ్రవరి 10

  • రెండో విడత: ఫిబ్రవరి 14

  • మూడో విడత: ఫిబ్రవరి 20

  • నాలుగో విడత: ఫిబ్రవరి 23

  • ఐదో విడత: ఫిబ్రవరి 27

  • ఆరో విడత: మార్చి 3

  • ఏడో విడత: మార్చి 7 

  • ఫలితాలు: మార్చి 10


సర్వే ఫలితాలు..


ఉత్తర్‌ప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ న్యూస్, సీఓటర్ సంయుక్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి. నవంబర్, డిసెంబర్ నెలలో జరిగిన సర్వేలో ప్రస్తుతం అధికారంలో ఉన్న భాజపానే మరోసారి యూపీలో సర్కార్ చేపట్టనుందని తేలింది. తాజాగా చూసినా అత్యధికంగా భాజపాకి 41.5 శాతం ఓట్లు, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాద్ పార్టీకి 33.3 శాతం ఓట్లు రానున్నాయని సర్వేలో వచ్చింది. గత ఎన్నికలతో పోల్చితే భాజపా ఓట్ల శాతం తగ్గుతుండగా.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా కాంగ్రెస్ మాత్రం అంతగా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్‌ రేసులో వెనుకంజ వేసేలా కనిపిస్తోంది.


Also Read: UP Polls 2022: అఖిలేశ్‌ యాదవ్‌పై యోగి ఫైర్.. మాఫియా గ్యాంగ్‌కు టికెట్లు ఇచ్చారని ఆరోపణ


Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 2.71 లక్షల మందికి కరోనా.. 8 వేలకు చేరువలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య


Also Read: 1 Year of Vaccination: భారత్ మరో రికార్డ్.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలై ఏడాది పూర్తి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి