ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఊర మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రానికి 'ది వారియర్' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు టైటిల్ రివీల్ చేయడంతో పాటు సినిమాలో రామ్ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.
ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తే... రామ్ క్యారెక్టర్ కూడా అర్థం అవుతోంది. సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. రఫ్ అండ్ టఫ్ లుక్... చేతిలో గన్... రామ్ చుట్టూ పోలీసులు... 'ది వారియర్' లుక్ సూపర్ అని ఆడియన్స్ అంటున్నారు. రామ్ - లింగుస్వామి కాంబినేషన్ అనగానే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. దానికి తోడు తొలిసారి రామ్ తమిళ సినిమా చేస్తుండటం... 'రన్', 'ఆవారా', 'పందెం కోడి' విజయాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన లింగుస్వామి స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తుండటంతో కథ ఎలా ఉంటుంది? టైటిల్ ఏం పెడతారు? అని ఆడియన్స్‌లో డిస్కషన్ మొదలు అయ్యింది. ఇప్పుడు అన్నిటికీ లింగుస్వామి సమాధానం ఇచ్చారు.
ఫస్ట్‌లుక్ విడుదల చేసిన సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ... "రామ్ లుక్, టైటిల్ పోస్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది. ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. వాటికి మించి సినిమా ఉంటుంది. ఈ నెలలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశాం. ప్రస్తుతం ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. టాప్ టెక్నీషియన్లు, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని రూపొందిస్తున్నాం" అన్నారు.
రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా, అక్షరా గౌడ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్షన్: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: అన్బు-అరివు, సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా - లింగుస్వామి, మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్, సమర్పణ: పవన్ కుమార్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్. లింగుస్వామి.
Also Read: అల... హిందీ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రెడీ! అలా 'పుష్ప' క్రేజ్‌ను వాడేస్తున్నారు మరి!!
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
Also Read: నిర్మాతకు ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన కీర్తీ సురేష్... ఆ నిర్మాత ఎవరంటే?
Also Read: పది రోజుల్లో సినిమా రిలీజ్... ఇప్పుడు హీరోయిన్‌కు కరోనా పాజిటివ్
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: 'సూపర్ మచ్చి' రివ్యూ: సూపర్ అనేలా ఉందా? లేదా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి