కరోనా కారణంగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్లు, కర్ఫ్యూల మధ్య కొట్టు మిట్టాడుతోంది. నష్టపోని వ్యక్తి అంటూ లేడు. రోజు కూలీకి పని దొరకక పూట గడవడం కష్టమైంది.. చిరు వ్యాపారికి వ్యాపారం నడకవ అప్పులయ్యాయి. ఓ పెద్ద వ్యాపారి ఉద్యోగులకు జీతాలివ్వలేక.. నిర్వహణ ఖర్చులు భరించలేక అప్పుల పాలయ్యారు. ఈ రేంజ్ అలా పెరుగుతూ పోయింది. ఎంత పెద్ద వ్యాపారి అయితే అంత ఎక్కువగా నష్టపోయారు. కానీ ఇంకా భారీ వ్యాపారులు అంటే..  టాప్ టెన్ కంపెనీల యజమానులు మాత్రం ఇబ్బడిమబ్బడిగా సంపద పోగేసుకున్నారు. కరోనా కంటే ముందు ఉన్న వారి సంపద.. కరోనా వచ్చిన తర్వాత రెండింతలు అయింది. ఆక్స్‌ఫామ్‌ ఈ వివరాలను విడుదల చేసింది. 


Also Read: బ్రిటిషు గడ్డను ఏలనున్న భారత మూలాలున్న నేత ! కల కాదు నిజంగానే జరగబోతోందా ?


ప్రపంచంలో టాప్ టెన్ ధనవంతుల్లో  ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్ బెర్గ్ లాంటి వాళ్లు ఉన్నారు. ఈ పది మంది ధనవంతులకు కలిపి కోవిడ్‌కు ముందు 700 బిలియన్ డాలర్ల సంపద ఉండేది. కానీ ఇప్పుడు వారందరి ఆస్తి ఒకటిన్నర ట్రిలియన్లకు చేరుకుంది. సగటున ఒక్కొక్కరు ప్రతి రోజూ 1.3 బిలియన్ డాలర్ల సంపద పోగేసుకున్నారు. ఈ లెక్కలు చూస్తే ప్రపంచంలో పేదలు మరింత పేదలవుతున్నారు.. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారని సులువుగా అంచనా వేయవచ్చు. 


Also Read: వామ్మో.. ఇలా ఉందేంటి? అమెరికన్లను వణికిస్తున్న ‘ఐస్ డిస్క్’.. రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్షం


ఇండియాలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. రిలయన్స్ అధినేత అంబానీ ఆస్తులు యాభై శాతానికిపైగా పెరిగాయి. జియోలోకి వరుసగా వచ్చిన పెట్టుబడులు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. గౌతమ్‌ అదానీ సంపద ఒక్క ఏడాదిలో రు.1.04 నుంచి ఏకంగా రు.5.05లక్షల కోట్లకు ఎదిగింది. కొత్తగా 5 8 మంది బిలియనీర్లు పెరిగి 237కు చేరారు. ధనవంతుల జాబితాలో 179 మంది చేరి 1,007కు పెరిగారు.


Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!


ప్రపంచవ్యాప్తంగా కరోనా సమయంలో ఆస్తులు పెంచుకున్న కోటీశ్వరులు కలిగిన దేశాల్లో భారత్‌ ఆరవ స్థానంలో వుంది. అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్‌లు ముందు స్థానాల్లో వున్నాయి. మొత్తంగా ప్రపంచ దేశాలన్నింటిలో ఆదాయ అసమానతలు పెరిగాయని ఆక్స్‌ఫామ్ అంచనా వేసింది. ఆర్థిక విధానాల్లో తగిన మార్పులు చేపట్టకపోతే.. ఈ అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందని, దీర్ఘకాల మహమ్మారిగా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఇది నిజమే మరి !


Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి