అప్పట్లో బ్రిటిషర్లు ఇండియాను పరిపాలించారు.  అదో చరిత్ర కానీ ఇండియన్లు కానీ..ఇండియన్ మూలాలున్న వారు కానీ ఎవరైనా ఎప్పుడైనా... బ్రిటన్‌ను పరిపాలిస్తారు అని ఊహించగలమా ? అసలు అలాంటి ఆలోచన రాదు..కానీ ఇప్పుడు వస్తోంది. ఆ అవకాశం వచ్చింది కూడా.  బ్రిటన్‌ ప్రధానమంత్రి పదవి భారత సంతతికి చెందిన వ్యక్తికి లభించే అవకాశం కనిపిస్తోంది. బ్రిటన్‌ ఆర్థిక శాఖ మంత్రి రిషి సునక్‌ ప్రధాని రేసులో ముందున్నట్లుగా బ్రిటన్ రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.


Also Read: వామ్మో.. ఇలా ఉందేంటి? అమెరికన్లను వణికిస్తున్న ‘ఐస్ డిస్క్’.. రెండేళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్షం


యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ పార్టీ గేట్ వివాదంలో ఇరుక్కున్నారు. బ్రిటన్‌లో కరోనా మొదటి వేవ్‌ లాక్‌డౌన్‌ అమల్లో సమయం అంటే 2020 మేలో ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మందు పార్టీ ఇచ్చారు. అప్పట్లో కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయి. ప్రధాని హోదాలో ఉండి..  కోవిడ్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ బోరిస్‌ జాన్సన్‌ పార్టీ ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ వీడియో బయటకు వచ్చింది. దీంతో ప్రధాని బోరిస్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో  బ్రిటన్‌ ప్రిన్స్‌ ఫిలిప్‌ చనిపోయి.. అంత్యక్రియలు ఇంకాపూర్తి కాకుండా..  భౌతిక కాయం ఉన్న సమయంలోనే బోరిస్ తన ఇంట్లోనే పెద్ద పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 


Also Read: నరక ద్వారం.. 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది.. చిన్న తప్పు ఎంత పనిచేసింది!


ఇవన్నీ కలిసి పార్టీ గేట్ వివాదంగా రాజకీయ దుమార రేపుతున్నాయి. వీటిపై బోరిస్‌ జాన్సన్‌ బ్రిటన్‌ పార్లమెంటులో క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన ప్రధాని పీఠం దిగాలన్న డిమాండ్లు ఎక్కువయ్యాయి. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే ఆయన స్థానంలో భారతీయ మూలాలున్న రిషి ప్రధాని పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని ఎక్కువ మంది భావిస్తున్నారు.  


Also Read: తత్కాల్‌లో రైల్వే టికెట్స్ వేగంగా బుక్ చేయాలా? ఇదిగో ఇలా చేయండి


ఆర్థిక మంత్రిగా రిషి సునక్ పనితీరు అందర్నీ ఆకట్టుకుంటోంది.  కోవిడ్‌ విలయంతో తరచూ లాక్‌డౌన్లతో కునారిల్లుతున్న దేశ ఆర్థిక వ్యవస్థని తిరిగి పట్టాలెక్కించడానికి రిషి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. భారత మూలాలు కలిగి బ్రిటన్‌లో పుట్టి పెరిగిన రిషి ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. వీరికి కృష్ణ, అనుష్క అనే కుమార్తెలు ఉన్నారు. అన్నీ కలిసి వచ్చి రిషి సునక్ యూకే ప్రధానమంత్రి అయితే... చరిత్రలో కీలక ఘట్టమే అనుకోవచ్చు. 


Also Read: ఓర్నీ.. చేప వీర్యంతో స్పెషల్ కర్రీ.. అంత కరువేంది బ్రో!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి