సినిమా ఇండస్ట్రీలో టైటిల్ వివాదాలను ఇప్పటికే చాలా సార్లు చూశాం. ఒక టైటిల్ కోసం దర్శకనిర్మాతలు, హీరోలు కోర్టు వరకు వెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోలు కూడా ఓ టైటిల్ కోసం ఫైట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ టైటిల్ ఏంటంటే 'వారియర్'. రామ్ పోతినేని హీరోగా.. దర్శకుడు లింగుస్వామి రూపొందిస్తోన్న సినిమాకి 'ది వారియర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 


ఈరోజు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నిజానికి ఈ సినిమాకి ముందుగా 'వారియర్' అని మాత్రమే టైటిల్ గా అనుకున్నారట. నిన్నటివరకు కూడా ఇదే టైటిల్ తో పోస్టర్ ను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈరోజు వారియర్ కు ముందు The(ది)ని యాడ్ చేసి టైటిల్ పోస్టర్ వదిలారు. ఈ విషయం నటుడు హవీష్ కి నచ్చడం లేదట. 


వారియర్ అనే టైటిల్ తనదని.. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయిందని.. సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉందని.. ఇలాంటి సమయంలో రామ్ అండ్ టీమ్ టైటిల్ ను ఇలా మార్చేసి ప్రకటించడం కరెక్ట్ కాదని.. ఈ విషయం మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఛాంబర్ లో కంప్లైంట్ చేస్తానని అంటున్నాడట హవీష్. అయితే 'వారియర్' అనే పేరుతో హవీష్ సినిమా చేస్తున్నాడనే విషయం ఎవరికీ తెలియదు. 


ఈరోజు రామ్ తన సినిమా పోస్టర్ ను విడుదల చేయడంతో హవీష్ సినిమా మేటర్ బయటకొచ్చింది. రామ్ గనుక ఇదే టైటిల్ తో సినిమాను కంటిన్యూ చేస్తే.. హవీష్ తన సినిమా టైటిల్ ను మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ అలా చేయడం హవీష్ కి  ఇష్టం లేదట. 'ది వారియర్' అని రామ్ పెట్టినప్పటికీ.. తన సినిమా టైటిల్ తో కలిసిపోతుందని కాబట్టి ఈ విషయంలో హవీష్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి!






Also Read: అతడు టార్చర్ చేస్తుంటాడు.. ఆ విషయం తెలిస్తే రివెంజ్ తీర్చుకునేదాన్ని.. రష్మిక వ్యాఖ్యలు..


Also Read: రిస్క్ తీసుకోనంటున్న జేజమ్మ.. షూటింగ్ ఆలస్యం..


Also Read: అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు..? ఐటెం సాంగ్ వివాదంపై దేవిశ్రీ ఫైర్..


Also Read: ఆ డైరెక్టర్ ఒంటరిగా రూమ్ కి రమ్మన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్..




 


 





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి