ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని వివిధ రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు భేటీ కానుంది. గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎన్నికల తేదీ మార్చాలని కాంగ్రెస్, భాజపా, అకాలీదళ్ తదితర పార్టీలు కోరాయి. 







ఎందుకంటే?


ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి ఉంది. ఈ సందర్భంగా లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్​ప్రదేశ్ వారణాసికి వెళ్తుంటారు. ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉండదని రాజకీయ పార్టీలు పేర్కొంటున్నాయి.


సీఎం లేఖ..


పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్​జిత్ సింగ్ చన్నీ కూడా ఈ విషయమై జనవరి 13న ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రవిదాస్ జయంతి సందర్భంగా పంజాబ్ నుంచి చాలామంది ఉత్తర్‌ప్రదేశ్ వెళ్తారని చన్నీ అన్నారు. అందుకోసమే ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరిన విషయాన్ని ఈసీ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఈ వర్గానికి చెందినవారు దాదాపు 32 శాతంగా ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. 


ఇతర పార్టీలు..


ఎన్నికలు వాయిదా వేయాలని విషయంపై కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు కూడా ఏకతాటిపై ఉన్నాయి. భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. మరి రాజకీయ పార్టీల చేసిన అభ్యర్థనను ఈసీ పరిగణిస్తుందా లేక మునుపటి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తుందో ఈ రోజు భేటీలో తేలనుంది.


Also Read: Omicron Cases: భారత్‌లో కాస్త శాంతించిన కరోనా మహమ్మారి.. మరోవైపు 8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి