ఆఫ్రికన్ దేశమైన మొరాకోలో ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో జరిగిన సంఘటన ఇప్పుడు దేశమంతా తీవ్ర దుమారం రేపుతోంది. ఓ ప్రొఫెసర్ తన లైంగిక కోరికలు తీర్చుకొనేందుకు విద్యార్థినులను వేధించినట్లుగా బయటపడింది. బదులుగా వారికి పరీక్షల్లో మంచి మార్కులు వేసినట్లుగా తేలింది. ఈ కేసులో నిందితుడిని మొరాకోలోని ఓ కోర్టు దోషిగా తేల్చి రెండేళ్ల పాటు జైలు శిక్ష కూడా విధించింది. అక్కడ హై ప్రొఫైల్ కేసుగా చెబుతున్న ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ప్రొఫెసర్‌తో పాటు ఈ నేరంతో మరో నలుగురు ప్రొఫెసర్లకు కూడా సంబంధం ఉందనే అభియోగాలు వచ్చాయి. దీంతో వారుకూడా కోర్టులో హాజరు కానున్నారు. మొరాకోలోని హాసన్ యూనివర్సిటీలో ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


బీబీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. యూనివర్సిటీలకు సంబంధించి ఇలాంటి కేసుల్లో కోర్టు తీర్పు ఇవ్వడం అక్కడ ఇదే తొలిసారి. హాసన్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం బోధిస్తున్న ప్రొఫెసర్ కొంత కాలంగా విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడు. తన కోరికలు తీర్చితే మంచి గ్రేడ్లు వచ్చేలా మార్కులు వేస్తానంటూ ఒప్పందం కుదుర్చుకునేవాడు. ఈయన తరహాలోనే ఈ యూనివర్సిటీలో మరో నలుగురు ప్రొఫెసర్లు ఇలాంటి పాడు పనులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. వారి విషయంలో కూడా పోలీసులు విచారణ జరిపి ఆ నలుగురిని కూడా కోర్టులో హాజరుపర్చనున్నారు.


బయటపడింది ఇలా..
ప్రొఫెసర్ తరచూ విద్యార్థినులతో చేసే లైంగిక చాటింగ్‌లను గత సెప్టెంబరులో ఆ యూనివర్సిటీకి చెందిన యువతి సోషల్ మీడియాలో పెట్టింది. మెల్లగా అది వైరల్ అయి.. యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌కు కూడా తెలిసింది. అనంతరం ప్రొఫెసర్‌పై కేసు నమోదు కావడం.. కోర్టు వరకూ వెళ్లడం, శిక్ష పడడం జరిగింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే దేశమంతా తీవ్రమైన నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. నిరసన కారులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.


Also Read: Kurnool కలెక్టర్ పీఏని అని చెప్పి డబ్బులు డిమాండ్.. నిందితుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు


Also Read: Nellore: కోడి పెంట తరలింపు పేరుతో దిమ్మతిరిగే దందా.. ‘పుష్ప’ రేంజ్‌లో మాస్టర్ ప్లాన్లు, పక్క రాష్ట్రం నుంచి..


Also Read: Ambati Rambabu Covid Positive: అంబటి రాంబాబుకు కరోనా.. మూడోసారి కొవిడ్ బారిన పడిన YSRCP ఎమ్మెల్యే


Also Read: D.Srinivas: కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీ ఎంట్రీ.. 'కారు' దిగి 'చేయి' పట్టుకునేది ఎప్పుడంటే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి