టాంజానియాలో పశువులు మేసుకునే యువకుడు కిలీ పౌల్. ఇన్ స్టాలో ఇతగాడికి 12 లక్షల మంది ఫాలోవర్లున్నారు. ఇంత ఫాలోవర్లలో ఇండియా నుంచి సగం మందికి పైగా ఉన్నారు. కారణం అతడు బాలీవుడ్ పాటలను ఎంచుకుని వాటిని అతడే పాడుతున్నట్టు నటిస్తాడు. హిందీ తెలియని భాషే అయినా ఆ పదాలను సరిగ్గా పలుకుతూ లిప్ సింక్ మిస్ అవ్వకుండా చూసుకోవడం ఇతడి ప్రత్యేకత. ఆ పాటలు పాడుతూ కిలీ చూపించే హావభావాలు మనుసను కరిగించేస్తాయి. తెగ నచ్చేస్తాయి. అప్పుడప్పుడు పాటలకు డ్యాన్సులు కూడా చేస్తుంటాడు. తనతో పాటూ చెల్లికి కూడా ఈ పని నేర్పాడు. ఇద్దరూ కలిసి డ్యూయెట్లు పాడుతున్న వీడియోలు కూడా అప్ లోడ్ చేస్తుంటాడు కిలీ. అతడి వీడియోలు చూస్తుంటే చూడాలనిపిస్తూ ఉంటాయి. తనను తాను టాంజానియన్ కంటెంట్ క్రియేటర్ చెప్పుకుంటాడు కిలీ.
కిలీ బాలీవుడ్లో హిట్ అయిన పాటలను ఎంచుకుంటాడు. ఈ మధ్య ఒక తెలుగు పాటను కూడా ఎంపిక చేసుకుని డ్యాన్స్ చేశాడు. పుష్పలోని ‘ఊ అంటావా మావా’అతడికి బాగా నచ్చేసింది. ఆ పాటలకు స్టెప్పులేశాడు. పాటకు తగ్గట్టే డ్యాన్సు చేసి ఆకట్టుకున్నాడు. అలాగే పుష్ప హిందీ రీమేక్ నుంచి చూపే బంగారమాయేనా పాటను ఎంచుకున్నాడు. ఆ పాటకు అల్లు అర్జున్ లా కాళ్లీడ్చేస్టెప్పును వేసి తన దైన స్టైల్లో వేశాడు. ఆ వీడియోలు మీరూ చూడండి.
Also read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది
Also read: నాన్‌స్టిక్ పాన్‌పై గీతలు పడ్డాయా? అయితే వాటిని పడేయాల్సిందే, లేకుంటే క్యాన్సర్ కారకాలుగా మారచ్చు