Compassionate Appointments In AP:కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆ కుటుంబాల నుంచి కారుణ్య నియామకానికి ఏపీ ప్రభుత్వం అనుమతి గతంలో నిర్ణయం తీసుకుంది. కరోనాతో మరణించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబీకులకు కారుణ్య నియామకాలు వర్తిస్తాయిని ఆదేశాలలో పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా నియామకాలు చేపట్టాలని ఈ మేరకు ఏపీ ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కరోనాతో చనిపోయిన అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్ కుటంబసభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని ఉత్వర్వులలో ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.
కరోనా వైరస్ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ పలు కుటుంబాల్లో విషాదం నింపింది. పలు కుటుంబాలు తల్లిదండ్రులను కోల్పోయాయి. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్‌లైన్ వారియర్స్ ఉన్నారు. వారు చనిపోవడంతో కుటుంబ పోషణ ఎంతో భారమవుతోంది. ఆ కుటుంబాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు పరిశీలించి పరిస్థితి అర్థం చేసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారుణ్య నియామకాల నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగి చనిపోగా రోడ్డున పడ్డ కుటుంబాలు ఇక మరింతగా నష్టపోకూడదని కారుణ్య నియామకాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తక్కువ స్థాయి హోదాతో సరి..
కరోనా సమయంలో విధులు నిర్వహించి చనిపోయిన ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వారియర్ల కుటుంబసభ్యులలో అర్హులైన వారికి ఉద్యోగాలు త్వరలో ఇవ్వనుంది. అయితే మరణించిన ఉద్యోగి కంటే తక్కువస్థాయి హోదాతో నియామకాలు చేపట్టనున్నట్లు ఉత్తర్వులలో స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కోరింది. గ్రామ/వార్డు సచివాలయాల్లోనూ కొందర్ని నియమించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో కొవిడ్19 ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కారుణ్య నియామకాలను 2021 నవంబరు 31లోగా చేపట్టాలని గతంలో నిర్ణయించారు. కానీ దరఖాస్తులు భారీ సంఖ్యలో రావడంతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. కానీ అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను సత్వరమే పరిశీలించి తక్షణం గ్రామ, వార్డు సచివాలయాల్లోని కొన్ని ఖాళీలను కొవిడ్19 సమయంలో చనిపోయిన ఉద్యోగుల అర్హులైన కుటుంబసభ్యులతో భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఉత్వర్వులలో స్పష్టం చేశారు.
Also Read: NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?
Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. రూ.300 పెరిగిన వెండి, నేటి తాజా ధరలు ఇవీ..