2022 జనవరి 19 బుధవారం రాశిఫలాలు


మేషం
వ్యాపారస్తులకు మంచి అవకాశాలు వస్తాయి..ప్రయోగాలు చేయొద్దు. పెద్దల ఆశీస్సులతో పనులు ప్రారంభించడం లాభిస్తుంది. వస్త్ర వ్యాపారులు నష్టపోతారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు. విద్యార్థులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. 


వృషభం
ముఖ్యమైన పనులు ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు ఆఫీసు పనుల్లో  చాలా బిజీగా ఉంటారు. ఒకే చోట పనిచేసే వారితో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. విద్యార్థులు ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో ఏ విషయంలోనైనా విభేదాలు పరిష్కారమవుతాయి. కొత్త పనిని ప్రారంభించడం శ్రేయస్కరం. 


మిథునం
మీరు మీ పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. టైమ్ కి తినకపోవడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. కోపంలో ఉన్నప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడవద్దు. ఏకాగ్రత లేకపోవడం వల్ల మీ పని దెబ్బతింటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి 


Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
కర్కాటకం
ఈరోజు మీరు ఇంటి పనిలో చాలా బిజీగా ఉంటారు. ఆఫీసులో ఎవరితోనైనా వాగ్వాదం జరగొచ్చు. కమీషన్‌కు సంబంధించిన వ్యాపారం కలిసొస్తుంది. మీరు చేసే పనిలో బహుమతి పొందుతారు. పూర్వీకుల ఆస్తి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోండి. శుభవార్త వినే అవకాసం ఉంది. 


సింహం
ఈరోజు మీరు కొంచెం విచారంగా ఉంటారు. ఓ పనిలో నష్టాన్ని ఎదుర్కొంటారు.  ఆరోగ్యం అంత బాగా ఉండదు.  బంధువులతో మనస్పర్థలు రావొచ్చు. రోజువారీ అవసరాలకు ఎక్కువ ఖర్చు చేయవద్దు. మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.


కన్య 
మీరు కొత్తగా ఏదైనా ట్రై చేయాలని అనుకుంటే ఈ రోజు అనుకూలమైన రోజు. మీ ఆలోచనలను కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. డబ్బుల కారణంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. కార్యాలయంలో మీపని పెరుగుతుంది. ఆగిపోయిన  ప్రభుత్వ పనులు సులువుగా పూర్తవుతాయి. 


Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2
తుల
మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి.  అధికారులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం  ఉంది. మీరు వాహనం, ఆస్తి కొనుగోలు చేయవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.  మీరు ఉద్యోగంలో అదనపు బాధ్యతలను మోయవలసి ఉంటుంది. మీ దినచర్య చాలా క్రమశిక్షణతో ఉంటుంది.


వృశ్చికం
మీరు సామాజిక మతపరమైన కార్యక్రమంలో పాల్గొంటారు. మీరు సమీపంలోని ప్రదేశాన్ని సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీరు కార్యాలయంలో గౌరవాన్ని పొందవచ్చు. క్రయ విక్రయాలకు సంబంధించిన పనుల్లో భారీ ధనలాభం ఉంటుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. 


ధనుస్సు
చేతిలో డబ్బు లేకపోవడం ఏదైనా పెద్ద పనికి ఆటంకం కలిగిస్తుంది. పిల్లల విషయంలో ఇబ్బందులు ఉండవచ్చు.ఆరోగ్య సమస్య ఉండవచ్చు. అందరినీ నమ్మొద్దు. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి. మీ పని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. చదువులపై ఆసక్తి ఉంటుంది.


Also Read: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?
మకరం
మీరు భాగస్వామ్య పనుల్లో గొప్ప విజయాన్ని పొందుతారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవద్దు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకుంటారు.


కుంభం
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మీరు వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. మీ ఖర్చులను తప్పకుండా తగ్గించుకోండి. సంఘంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఎలాంటి బాధనుంచి అయినా ఉపశమనం పొందుతారు. 


మీనం
ఈ రోజు మీకు ఆహ్లాదకరమైన రోజు అవుతుంది. మీరు వ్యాపార లావాదేవీల నుంచి లాభం పొందుతారు. తప్పుడు పనులు చేసేందుకు ఆకర్షితులవుతారు. ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. కోర్టు వ్యవహారాలు కలిసొస్తాయి. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. యువత ఉద్యోగాలు పొందవచ్చు.


Also Read: మీ నక్షత్రం...మీ రాశి....ఏ నక్షత్రానికి ఏ అక్షరాలో ఇలా తెలుసుకోండి...
Also Read: రుద్రాక్ష చెట్టు ఇంట్లోనే పెంచుకోవచ్చు…ఎలాగో తెలుసా?
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి