అక్కినేని నాగచైతన్యతో సమంత వివాహం అక్టోబర్ 7, 2017లో జరిగింది. అంత కంటే ముందే ఆమె విడాకులు తీసుకోవాలని అనుకున్నారా? పెళ్లికి నాలుగేళ్ల క్రితం ఆమె చేసిన ట్వీట్ చూస్తే... 'అవును' అనిపించక మానదు. ఎప్పుడో సరదాగా చేసిన పనులు ఆ తర్వాత మెడకు చుట్టుకోవడం, గతం వెంటాడటం అంటే ఇదే కాబోలు!


కథానాయికగా సమంత వరుస విజయాల్లో ఉన్న రోజులు అవి. 'బృందావనం', 'దూకుడు', 'ఈగ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విజయాలు సాధించాయి. 'జబర్దస్త్' సినిమా ప్లాప్ అయినా... చేతిలో పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది', ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' ఉన్నాయి. అప్పుడు సమంత ఓ ట్వీట్ చేశారు... "నాకు తెలుసు... నేను పెద్దదాన్ని అవుతున్నాను (వయసు పెరుగుతోందనే ఉద్దేశంతో). మమ్మీ ఫీలింగ్స్ మొదలు అయ్యాయి" అని! 'రామయ్యా వస్తావయ్యా' సినిమా సెట్స్ మీద ఉంది. సమంత ట్వీట్‌కు దర్శకుడు హరీష్ శంకర్ సరదాగా ఏదో అంటే... "మీరిద్దరూ డాన్స్ చేయడం కోసం నేను పెళ్లి చేసుకుంటా. అలాగే, విడాకులు తీసుకుంటా" అని  సమంత రిప్లై ఇచ్చారు. తర్వాత హరీష్ శంకర్ తన ట్వీట్ డిలీట్ చేశారు. కానీ, సమంత ట్వీట్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఆమె అప్పుడు సరదాగా అన్నప్పటికీ... ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో కొంత మంది ఓల్డ్ ట్వీట్‌ను తవ్వి పైకి తీశారు. అదీ సంగతి!









నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్ మీద మరింత కాన్సంట్రేట్ చేశారు. సినిమాలు చేయడంలో వేగం పెంచారు. పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం', 'యశోద', ఓ తెలుగు - తమిళ ద్విభాషా సినిమా  సమంత చేతిలో ఉన్నాయి. 


Also Read: ఇప్పుడూ రజనీకాంత్ అల్లుడు అంటారా? ఆ ట్యాగ్ నుంచి ధనుష్ బయటకొచ్చాడా? లేదా?
Also Read: రజినీ ఇద్దరు కూతుళ్లదీ అదే బాట.. ఐశ్వర్య విడాకులపై సౌందర్య స్పందన ఇది..
Also Read: పొగరని ముఖం మీదే అనేశారు... శ్రీదేవి చనిపోలేదు, విదేశాల్లో ఉంది: మహేశ్వరి
Also Read: ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో.. 60 ఏళ్ల వృద్ధుడిగా బాలయ్య..
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి