నందమూరి బాలకృష్ణ 'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఈ వారంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా తన కొత్త సినిమాను మొదలుపెట్టారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం పోషిస్తున్నారట. కథ ప్రకారం.. ఒకటి యువకుడి పాత్ర కాగా.. మరొకటి అరవై ఏళ్ల వృద్ధుడి పాత్ర అని తెలుస్తోంది. సినిమాలో ఈ వృద్ధుడి పాత్ర హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు.
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలయ్య వృద్ధుడి పాత్రకు ఫ్యాక్షన్ తో ముడిపెట్టినట్లు సమాచారం. అందరూ.. ఆయన్ను 'పెద్దాయన' అని పిలుస్తారట. సినిమాకి ఈ పాత్ర కీలకమని తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ రోల్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారట. 'అఖండ' సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించారు.
ఇప్పుడు మరోసారి ద్విపాత్రాభినయంతో ఫ్యాన్స్ ను అలరించనున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తుండగా.. కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించబోతుంది. అలానే కన్నడ నటుడు దునియా విజయ్ ను విలన్ గా ఎంపిక చేసుకున్నారు. కథ ప్రకారం.. సినిమాలో మరికొంతమంది నటులు విలన్లుగా కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులపై వర్మ కామెంట్స్..
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. అఫీషియల్ ప్రకటన!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి