మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ సీన్లలో నటించి వార్తల్లో నిలిచింది. దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన ఆశిష్ రెడ్డి నటించిన 'రౌడీ బాయ్స్' సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు అందులో అనుపమ లిప్ లాక్ సీన్స్ చూసి షాకయ్యారు అభిమానులు. సినిమాలో ఏకంగా మూడు లిప్ లాక్ సీన్స్ లో నటించింది అనుపమ. అలానే ఓ ఇంటిమేట్ సీన్ లో కూడా కనిపించింది.
ఇప్పటివరకు తెరపై ఎంతో పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ లో నటించడం హాట్ టాపిక్ అయింది. ఇదివరకు కొన్ని చిత్రాల్లో ఆమెని బోల్డ్ సీన్స్ లో నటించమని కోరగా.. నో చెప్పింది. కానీ 'రౌడీ బాయ్స్' సినిమాకి మాత్రం ఒప్పుకుంది. దానికి కారణమేంటంటే.. ఈ ఒక్క సినిమా కోసం అనుపమకి రూ.50 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారట.
సాధారణంగా అనుపమకి అంత రెమ్యునరేషన్ ఇవ్వరు. పాతిక, ముప్పై లక్షల లోపే ఆమె పే చెక్ ఉంటుంది. అలాంటి 'రౌడీ బాయ్స్' సినిమా కోసం అరకోటి ఆఫర్ చేసేసరికి ఆమె కాదనలేకపోయింది. మొత్తానికి ఈ సినిమాలో అనుపమ పెర్ఫార్మన్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో టాక్ రానప్పటికీ.. అగ్రెసివ్ గా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ఇక ఫ్యూచర్ లో కూడా అనుపమ ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన '18 పేజెస్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే 'కార్తికేయ 2' సినిమాలో నటిస్తోంది అనుపమ.
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులపై వర్మ కామెంట్స్..
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. అఫీషియల్ ప్రకటన!
Also Read: 'వారియర్' టైటిల్ కోసం ఇద్దరు హీరోల ఫైట్.. నెగ్గేదెవరో..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి