మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ పెళ్లి చేసుకోబోతున్నారా? ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? అంటే... 'అవును. పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రేమలో ఉన్నారు' అనేది ఓ సెక్షన్ ఆఫ్ వెబ్ మీడియా చెప్పే మాట. ఇది ఇప్పటి నుంచి కాదు... జైపూర్‌లో నిహారికా కొణిదెల పెళ్లి జరిగినప్పటి నుంచి వినిపిస్తున్నది. నిహారిక పెళ్లికి హాజరైన కొంత మంది అతిథుల జాబితాలో లావణ్యా త్రిపాఠీ కూడా ఉన్నారు. అంతకు ముందు వరుణ్ తేజ్‌కు జంటగా 'మిస్టర్', 'అంతరిక్షం 9000 కెఎంపిహెచ్' సినిమాలు చేసినప్పటికీ... వరుణ్ చెల్లెలి పెళ్లి తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనేది ప్రముఖంగా వినిపించడం మొదలుపెట్టింది.
వరుణ్ తేజ్ పుట్టినరోజు (జనవరి 19న) సందర్భంగా మరోసారి లావణ్యా త్రిపాఠీతో ఆయన ప్రేమలో ఉన్నారనే మాట మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి ఓ అడుగు ముందుకు వేసి... గాసిప్ అంటూనే లావణ్యా త్రిపాఠీకి వరుణ్ తేజ్ ప్రపోజ్ చేయబోతున్నారని, అందుకోసం బెంగళూరు వెళ్లారనేది తాజా పుకారు. దీనికి లావణ్యా త్రిపాఠీ పరోక్షంగా, తెలివిగా సమాధానం ఇచ్చారని అనుకోవాలా? తాను బెంగళూరులో లేనని, డెహ్రాడూన్‌లో ఉన్నానని చెప్పాలని అనుకున్నారా? ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌కు అర్థం ఏమిటి?
Also Read: రౌడీ హీరోకి షాకింగ్ రెమ్యునరేషన్.. లాభాల్లో వాటా కూడా..Also Read: 'సుడిగాలి' సుధీర్ vs 'హైపర్' ఆది... సేమ్ క్యారెక్టర్ చేశారుగా!Also Read: ఆన్‌లైన్ టిక్కెట్ల జీవోపై హైకోర్టుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ !Also Read: జాన్వి కపూర్ వేసుకున్న ఈ స్విమ్ సూట్ ధరెంతో తెలుసా? షాకవ్వడం ఖాయంAlso Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి