News
News
X

NIA Searches: పీఎఫ్ఐపై ఎన్ఐఏ ఫోకస్! దేశవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్, పలువురి అరెస్టు - సడెన్‌గా ఎందుకిలా?

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ చోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్ఫోఫోర్స్‌మెంట్​ డైరక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.

FOLLOW US: 
 
మన దేశంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కార్యకలాపాలపై దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పీఎఫ్ఐ అనే సంస్థ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధుల సమీకరణ చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ చోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్ఫోఫోర్స్‌మెంట్​ డైరక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు కలిసి మంగళవారం ఉదయం సంయుక్త ఆపరేషన్​ మొదలుపెట్టాయి.

దేశంలో మొత్తం 8 రాష్ట్రాల్లో PFI సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులు, సంస్థ ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. యూపీ, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్, అసోంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ లో ఇంటలిజెన్స్ బ్యూరోతో పాటు సోదాలు జరుగుతున్న రాష్ట్రాల పోలీసులు కూడా సాయం చేస్తున్నారు.

గత రెండు వారాలుగా పీఎఫ్ఐ కార్యకలాపాలు ఉన్న చోట్ల NIA సోదాలు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22న దేశవ్యాప్తంగా ఎన్​ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. దేశంలో తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై 11 రాష్ట్రాల్లోని 106 మంది పీఎఫ్​ఐ నేతలను అరెస్టు చేసింది. కేరళలో ఎక్కువగా అరెస్టులు జరిగాయి. అక్కడ దాదాపు 22 మందిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలో 20 మంది, తమిళనాడులో 10, అసోంలో 9, యూపీలో ఎనిమిది మంది, ఏపీలో ఐదుగురు, మధ్యప్రదేశ్ లో నలుగురు, పుదుచ్చెరి, ఢిల్లీల్లో ముగ్గురు చొప్పున, రాజస్థాన్ లో ఇద్దరు అరెస్టు అయ్యారు. 

కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లాలో ఏడుగురు పీఎఫ్ఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ సోదాలకు వ్యతిరేకంగా వీరిలో కొందరు నిరసనలు చేశారు. పీఎఫ్ఐ బాగల్ కోట్ జిల్లా ప్రెసిడెంట్ అస్గర్ అలీ షేక్ కూడా అరెస్టు అయ్యారు. ఇంకా కలబురిగి, రాయచూర్, కోలార్, రామనగర, విజయపుర, బెళగావి, హుబ్బళ్లి - ధార్వాడ్, హాసన్ ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించిన పీఎఫ్ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. 

News Reels

పీఎఫ్​ఐ అంటే ఏంటి? అది ప్రమాదమా?
పీఎఫ్ఐ అంటే పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. అణగారిన వర్గాల సాధికారతే తమ లక్ష్యం అని చెప్పుకుంటూ కేరళ కేంద్రంగా 2006లో ఇది ఏర్పాటు అయింది. ఇప్పుడు ఢిల్లీలో హెడ్ ఆఫీసు ఉంది. అణగారిన వర్గాల కోసం పని చేస్తున్నామని పీఎఫ్ఐ చెప్పుకుంటున్నా.. ఎన్ఐఏ, ఐబీ లాంటి కేంద్ర భద్రతా సంస్థలు మాత్రం మరోలా చెబుతుంటాయి. అతివాద ఇస్లాంను పీఎఫ్​ఐ ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నాయి. 

పీఎఫ్​ఐపై ఇలా కేసులు నమోదు కావడం ఇదేం కొత్త కాదు. 2020లో పౌరసత్వ సవరణ చట్టం ఆందోళనల సమయంలో చాలా కేసులు పీఎఫ్ఐపై నమోదయ్యాయి. పౌరసత్వ చట్టం వ్యతిరేక నిరసనలు, 2020 ఢిల్లీ అల్లర్లు, యూపీ హాథ్రాసో దళిత బాలికపై గ్యాంగ్ రేప్ వ్యవహారంలో కుట్ర లాంటి ఇంకా వేర్వేరు సందర్భాల్లో పీఎఫ్​ఐ ఆర్థికంగా మద్దతు ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈడీ, ఎన్ఐఏ సంయుక్త ఆపరేషన్ ఎందుకు జరుగుతోంది?
ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నవారు, ఉగ్రవాదుల కోసం శిక్షణ ఇస్తున్నవారు, నిషేధిత సంస్థల్లో చేరేలా యువకులను ప్రభావితం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్​ సాగిస్తున్నామని ఎన్​ఐఏ చెబుతోంది.

Published at : 27 Sep 2022 09:54 AM (IST) Tags: NIA News Popular Front of India NIA Searches PFI News PFI leaders arrest

సంబంధిత కథనాలు

Gujarat Election Results 2022: కేజ్రీవాల్ మరో మోడీ అవుతారా? పంజాబ్ ప్లాన్ గుజరాత్‌లోనూ వర్కౌట్ అవుతుందా?

Gujarat Election Results 2022: కేజ్రీవాల్ మరో మోడీ అవుతారా? పంజాబ్ ప్లాన్ గుజరాత్‌లోనూ వర్కౌట్ అవుతుందా?

Election Results 2022 Live: గుజరాత్‌ను క్లీన్ స్వీప్ చేసిన BJP- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ జోష్

Election Results 2022 Live: గుజరాత్‌ను క్లీన్ స్వీప్ చేసిన BJP- హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ జోష్

Shivpal Singh Yadav: కలిసిపోయిన బాబాయ్- అబ్బాయ్- ఇక సమాజ్‌వాదీ పార్టీకి బూస్ట్

Shivpal Singh Yadav: కలిసిపోయిన బాబాయ్- అబ్బాయ్- ఇక సమాజ్‌వాదీ పార్టీకి బూస్ట్

Himachal Pradesh Election Results 2022: బీజేపీ నుంచి మా ఎమ్మెల్యేలకు థ్రెట్ ఉంది, అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా దిగజారుతుంది - భూపేష్ బాగేల్

Himachal Pradesh Election Results 2022: బీజేపీ నుంచి మా ఎమ్మెల్యేలకు థ్రెట్ ఉంది, అధికారం కోసం ఆ పార్టీ ఎంతకైనా దిగజారుతుంది - భూపేష్ బాగేల్

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

టాప్ స్టోరీస్

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

KTR Support : చదువుల సరస్వతికి మంత్రి కేటీఆర్ సాయం, వైద్య విద్యకు ఆర్థిక భరోసా!

Sajjala On United State ; ఏపీ, తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Sajjala On United State ;  ఏపీ,  తెలంగాణ కలపాలన్నదే వైఎస్ఆర్సీపీ విధానం - సజ్జల సంచలన ప్రకటన !

Komatireddy Comments ; ఏ పార్టీలో చేరాలో ఎన్నికలకు నెల ముందు డిసైడ్ చేసుకుంటా - కాంగ్రెస్‌లో లేనని సంకేతాలిచ్చిన కోమటిరెడ్డి !

Komatireddy Comments ; ఏ పార్టీలో చేరాలో ఎన్నికలకు నెల ముందు డిసైడ్ చేసుకుంటా - కాంగ్రెస్‌లో లేనని సంకేతాలిచ్చిన కోమటిరెడ్డి !

Telugu Movies 2022: గూగూల్‌ సెర్చ్‌లోనూ దక్షిణాది సినిమాల హవా, టాప్-10లో ఏయే సినిమాలు ఏయే స్థానాలంటే..

Telugu Movies 2022: గూగూల్‌ సెర్చ్‌లోనూ దక్షిణాది సినిమాల హవా, టాప్-10లో ఏయే సినిమాలు ఏయే స్థానాలంటే..