తమిళనాడులోని కూనూర్ సమీపంలో మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదంలో భారత డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ మరియు మరో 11 మంది మృతి చెందారు. ఈ హెలికాప్టర్‌లో 14 మంది ఉన్నారు. ప్రస్తుతం కెప్టెన్ వరుణ్ సింగ్.. వెల్లింగ్టన్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జనరల్ బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్ జిల్లాలోని సోహగ్‌పూర్ రాజకుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి పేరు కున్వర్ మృగేందర్ సింగ్. ఈ ఘటన తెలిసిన వెంటనే ఆమె సోదరుడు యశ్వర్ధన్ సింగ్ భోపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లారు.
బిపిన్ రావత్.. భార్య మధులిక రావత్.. ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (AWWA) అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆర్మీ సిబ్బంది భార్య, పిల్లలు మరియు వారిపై ఆధారపడిన వారి శ్రేయస్సు కోసం ఆమె పనిచేశారు. మధులిక ఢిల్లీలో చదువుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె అనేక రకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితుల కోసం చాలా సేవ చేశారు.
బిపిన్ రావత్ జనవరి 1, 2020న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) ఆఫ్ ఇండియాగా ఎన్నికయ్యారు. ఆయన కుటుంబం తరతరాలుగా భారత సైన్యంలో పనిచేస్తున్నారు. బిపిన్, మధులిక రావత్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బిపిన్ రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ కూడా భారత సైన్యంలో పనిచేసి లెఫ్టినెంట్ జనరల్ పదవి వరకు చేరుకున్నారు.
Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన
Also Read: Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?
Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష
Also Read: Chief of Defence Staff: ఏంటీ సీడీఎస్.. కార్గిల్ యుద్ధ కాలంలోనే ఈ పదవిపై చర్చలు జరిగాయా?
Also Read: CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!
Also Read: Chopper Crash Coonoor: సీడీఎస్ బిపిన్ రావత్ ఇక లేరు.. హెలికాప్టర్ కూలిన ఘటనలో 13 మంది మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి