తమిళనాడు ఊటీలో సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందారు. నీలగిరి జిల్లా కూనూరు ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలింది. ఈ విషయాన్ని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది.
అంతకుముందు ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్లు తమిళనాడు అటవీశాఖ మంత్రి కే రామచంద్రన్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే సైనికాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
బిపిన్ రావత్..
కుప్పకూలిన హెలికాప్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా ఆయన సిబ్బంది ఉన్నారు. గాలింపు, సహాయక చర్యల్లో ఆర్మీ నిమగ్నమైంది. చాపర్‌లో 14 మంది ఉన్నట్లు సమాచారం.
Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన
Also Read: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు
Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే