సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పార్లమెంటులో గురువారం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విషయం గురించి వివరించారు రాజ్‌నాథ్ సింగ్. హెలికాప్టర్ ప్రమాదంపై పూర్తి వివరాలను భారత ఆర్మీ చీఫ్ నరవాణే.. రాజ్‌నాథ్ సింగ్‌కు తెలిపారు.
ఘోర ప్రమాదం..
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. భారత చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కోయంబత్తూర్ కూనూరు మధ్యలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 14 మంది ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కాసేపటికే..
విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయలుదేరిన ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే కుప్పకూలినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 80 శాతం కాలిన గాయాలతో ఇద్దరి మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం.
ఈ ప్రమాదాన్ని వాయుసేన కూడా ధ్రువీకరించింది. జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీఎఫ్ హెలికాప్టర్ కూనూరు సమీపంలో కూలిపోయినట్లు ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. ఘటనపై విచారణకు ఆదేశించింది.
Also Read: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్... తయారుచేసిన శాస్త్రవేత్తలు
Also Read: క్యాన్సర్‌ను అడ్డుకునే ఆహార పదార్థాలివే... వారంలో ఓసారైనా తినండి
Also Read: నిద్ర సరిగా పట్టడం లేదా... ఈ విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి
Also Read: అబార్షన్ చేయించుకున్నాక ఎలా ఉంటుందో తెలుసా? ఈ బాధలన్నీ భరించాల్సిందే