త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ Mi-17V-5 రకానికి చెందినది. అత్యంత సమర్థవంతమైన.. అత్యాధునికమైన హెలికాఫ్టర్లలో ఒకటి. ఈ హెలికాప్టర్ Mi-17V-5ను మీడియం-లిఫ్టర్ ఛాపర్‌గా గుర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత అధునాతన హెలికాప్టర్‌లలో ఒకటి. ఛాపర్ యొక్క భద్రతా రికార్డు ప్రపంచంలోని కొన్ని ఇతర కార్గో ఛాపర్‌ల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ప్రమాదాలు తక్కువగా నమోదవుతూ ఉంటాయి.
Mi-17V-5 అనేది Mi-8/17 హెలికాప్టర్ల శ్రేణికి చెందినది. మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అగ్రదేశాల సైన్యం ఈ రకం హెలికాఫ్టర్‌ను వినియోగిస్తూ ఊంటాయి. రష్యాలోని కజాన్ హెలికాప్టర్స్ వీటిని ఉత్పత్తి చేస్తుంది. హెలికాప్టర్‌ను సైన్యం, ఆయుధాల రవాణా, అగ్నిమాపక మద్దతు, కాన్వాయ్ ఎస్కార్ట్, పెట్రోలింగ్ , సెర్చ్ అండ్ రెస్క్యూ వంటి వాటి కోసం విరివిగా ఉపయోగిస్తారు. భారత్ వద్ద ఈ రకం హెలికాఫ్టర్లు 80 ఉన్నాయి.
Mi-17V-5 హెలికాఫ్టర్‌లో క్లిమోవ్ TV3-117VM లేదా VK-2500 టర్బో-షాఫ్ట్ ఇంజన్లను ఉపయోగించారు. 2,100 నుంచి 2,700 హెచ్‌పీ పవర్ అవుట్‌పుట్‌ను హెలికాఫ్టర్ ఇంజిన్లు ఇస్తాయి. కొత్త-తరం హెలికాప్టర్‌లలో కూడా ఇదే సామర్థ్యం ఉంటుంది.ఇది పూర్తి-అధికార డిజిటల్ నియంత్రణ వ్యవస్థ తో ఉంటుంది. గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఒక్క సారి ఇంధనం నింపితే ఐదు వందలకుపైగా కిలోమీటర్లు పయనించవచ్చు. రెండు ట్యాంకులుఉంటాయి. అంటే వెయ్యి కిలోమీటర్ల వరకూ ఈ హెలికాఫ్టర్‌తో నిరాటంకంగా పయనించవచ్చు. హెలికాప్టర్ గరిష్టంగా 6,000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది.
Mi-17 రవాణా హెలికాప్టర్ ప్రయాణీకుల కోసం ప్రామాణిక పోర్ట్‌సైడ్ డోర్‌తో కూడిన పెద్ద క్యాబిన్‌ను ఉంటుంది. దళాలు, కార్గో తరలింపు కోసం వెనుకవైపు రాంప్ కూడా ఉంటుంది. హెలికాప్టర్ గరిష్టంగా 13,000 కిలోల టేకాఫ్ బరువును తీసుకెళ్లగలదు. 36 మంది సాయుధ సైనికులను లేదా 4,500 కిలోల బరువును మోయగలదు. అత్యంత వేడి ప్రాంతం.. సముద్ర వాతావరణాలు, అలాగే ఎడారి పరిస్థితులతో సహా వివిధ పరిస్థితులలో సమర్థంగా పని చేస్తుంది.
Mi-17V-5 నాలుగు మల్టీఫంక్షన్ డిస్‌ప్లేలు , నైట్-విజన్ పరికరాలు, ఆన్-బోర్డ్ వెదర్ రాడార్ ఆటోపైలట్ సిస్టమ్‌తో సహా అత్యాధునిక ఏవియానిక్స్‌తో కూడిన గ్లాస్ కాక్‌పిట్ ఈ హెలికాఫ్టర్ ప్రత్యేకత. భారతదేశం కోసం, Mi-17V-5 హెలికాప్టర్లు నావిగేషన్, ఇన్ఫర్మేషన్-డిస్ప్లేలు మరియు క్యూయింగ్ సిస్టమ్‌లతో సహా అందించారు.
కేవలం రవాణా మాత్రమే కాదు, Mi-17V-5 హెలికాఫ్టర్ అనేక రకాల ఆయుధాలను కలిగి ఉంటుంది, ఇది శత్రు వాతావరణం మధ్య దళాలను, సరుకును వదిలివేసేటప్పుడు అవసరం అవుతుంది. ఇది Shturm-V క్షిపణులు, S-8 రాకెట్లు, 23mm మెషిన్ గన్, PKT మెషిన్ గన్‌లు మరియు AKM సబ్-మెషిన్ గన్‌లను ఈ హెలికాప్టర్‌తో తో లోడ్ చేయవచ్చు. గన్నర్ కోసం వెనుక మెషిన్ గన్ స్థానం కూడా ఉంది.