ABP  WhatsApp

General Bipin Rawat Demise: 'బిపిన్ రావత్ లేకపోయినా ఆయన డైనమిజం మాలో శాశ్వతం'

ABP Desam Updated at: 08 Dec 2021 08:03 PM (IST)
Edited By: Murali Krishna

సీడీఎస్ బిపిన్ రావత్ మృతిపై త్రివిధ దళాధిపతులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వం ఎనలేనిదని కొనియాడారు.

'బిపిన్ రావత్ లేకపోయినా ఆయన డైనమిజం మాలో శాశ్వతం'

NEXT PREV

తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ మరణించడంపై త్రివిధ దళాధిపతులు సంతాపం ప్రకటించారు. సైన్యాధిపతి ఎమ్ఎమ్ నరవాణే, వాయుసేనాధిపతి ఆర్ చౌదరీ, నౌకాదళాధిపతి ఆర్ హరి కుమార్.. బిపిన్ రావత్‌ దుర్మరణం దేశానికి తీరని లోటుగా అభిప్రాయపడ్డారు.







జనరల్ బిపిన్ రావత్ డైనమిజం, స్ఫూర్తిదాయక నాయకత్వం మా జ్ఞాపకాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆయన నిరుపమాన సేవలు చిరస్మరణీయం.                                                       - ఎమ్‌ఎమ్‌ నరవాణే, భారత సైన్యాధిపతి







అడ్మిరల్ ఆర్ హరికుమార్ సహా భారత నేవీ మొత్తం సీడీఎస్ బిపిన్ రావత్, శ్రీమతి మధులిక రావత్ సహా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.                                                - భారత నౌకాదళం







సీడీఎస్ బిపిన్ రావత్‌ను కోల్పోవడం చాలా దురదృష్టం. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బిపిన్ రావత్, మధులిక రావత్ సహా ఇతర సైనికుల కుటంబాలకు భారత వాయుసేన సంతాపం వ్యక్తం చేస్తోంది.                                                - భారత వాయుసేన


ఏం జరిగింది?


తమిళనాడు ఊటీలో సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా 13 మంది మృతి చెందారు. నీలగిరి జిల్లా కూనూరు ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలింది. ఈ విషయాన్ని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. 


Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన


Also Read: Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?



Also Read: CDS Bipin Rawat Helicopter Crash: సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష


Also Read: Coonoor Chopper crash : ప్రకృతి రమణీయతే కాదు .. మద్రాస్ రెజిమెంట్ కేంద్రం కూడా ! కన్నూరులో అలాంటి ప్రమాదం ఎలా సాధ్యం ?


Also Read: Wellington Defence Staff College: 'బిపిన్ రావత్' హెలికాప్టర్ క్రాష్.. మరో 10 నిమిషాల్లో ల్యాండ్ అవ్వాల్సింది.. ఇంతలోనే..


Also Read: Chief of Defence Staff: ఏంటీ సీడీఎస్.. కార్గిల్ యుద్ధ కాలంలోనే ఈ పదవిపై చర్చలు జరిగాయా?


Also Read: CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!


Also Read: Chopper Crash Coonoor: సీడీఎస్ బిపిన్ రావత్ ఇక లేరు.. హెలికాప్టర్ కూలిన ఘటనలో 13 మంది మృతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Published at: 08 Dec 2021 07:52 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.