భారత మహాదళపతి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూలిపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అదే హెలికాఫ్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతం కూడా ఏ మాత్రం ప్రమాదకరమైనది కాదు. హిల్ స్టేషన్. పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు.. అక్కడ మిలటరీకి ఎంతో పట్టు ఉన్న ప్రాంతం కూడా. మద్రాస్ రెజిమెంట్ కార్యకలాపాలు అక్కడి నుంచే నడుస్తున్నాయి.
Also Read : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?
కూనూరు దారిలో మద్రాసు రెజిమెంట్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. అది మిలటరీ ప్రదేశం. కశ్మీర్ ను పోలి ఉంటుందికాబట్టే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్‌ను పెట్టి ఉటారు. ఈ పర్వతాలను బ్లూ మౌంటైన్స్ అనికూడా పిలుస్తారు. విల్లింగ్టన్ ప్రదేశం మద్రాసు రెజిమెంట్ కి కేంద్రంగా ఉంది. అక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న సైనికాధికారులతో నిర్వహించనున్న కార్యక్రమాల కోసం బిపిన్ రావత్.. అక్కడికి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
Also Read : సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష
ఆధునిక ప్రపంచంలో, ఊటీ చరిత్ర బ్రిటీష్, ముఖ్యంగా సైనికుల స్థావరాలతో మొదలైనది. ఈ పట్టణంలో ప్రవేశించిన వారికి ఆ ప్రదేశం లో బ్రిటీష్ వారి ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. కళలు, భవన నిర్మాణం, నమూనాలు, ఇళ్ళ నిర్మాణంలో శైలి అన్నీ బ్రిటీష్ కాలాన్ని గుర్తుకుతెస్తాయి. బ్రిటీషు వారి సాంస్కృతిక పద్ధతులు స్థానిక ప్రజల జీవితాల మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా పాతుకు పోయాయి.
Also Read : కుప్పకూలిన సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్.. 8 మంది మృతి
నీలగిరి పర్వతాలలో ఉన్న ఊటీ అని పిలుచుకునే ప్రాంతంలోని హెలికాఫ్టర్ కూలిపోయిన కూనూరు ఉంది. సముద్ర మట్టానికి 2,719మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏకాలంలోనైనా ఇక్కడి ప్రకృతి ఒడిలో విశ్రాంతి తీసుకోవచ్చు. అందమైన తోటలు, రంగురంగుల పూలు, టీ, కాఫీ తోటలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ప్రకృతి సహజ సౌందర్యం నీలగిరి సొంతం. పొడవాటి ఫైన్ వృక్షాలు ఉంటాయి. ఇంత ప్రకృతి సౌందర్యం మధ్య ఇంత ఘోర ప్రమాదాన్ని ఎవరూ ఊహించలేకపోయారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి