భారత త్రివిధ దళాల చీఫ్ బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిపిన్ రావత్ దేశానికి గొప్ప సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. దేశం ఆయన సేవలను గుర్తుంచుకుంటుందని అన్నారు .
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. దేశానికి బిపిన్ రావత్ గొప్ప సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు.
బిపిన్ రావత్ మరణంపై రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులందరికీ ధైర్యం ప్రసాదించాలని వేడుకున్నారు.
హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్‌ను కోల్పోవడం దేశానికి లోటు అని హోంమంత్రి అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు.
హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ చనిపోయినట్లుగా తెలియడంతో షాకయ్యానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మాజీ క్రికెటర్లు వీరేందర్ సెహ్వాగ్ , వీవీఎస్ లక్ష్మణ్‌లు కూడా బిపిన్ రావత్ సేవలను గుర్తు చేసుకున్నారు.