అన్వేషించండి

Tejas Crashed: కుప్పకూలిన 'తేజస్' యుద్ధ విమానం - ఇదే తొలి ప్రమాదం, ఎక్కడంటే?

Tejas: రాజస్థాన్ లోని జైసల్మేర్ లో భారత వాయుసేనకు చెందిన 'తేజస్' యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పారాచూట్ సాయంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.

LCA Tejas Crashed in Rajasthan: భారత వాయుసేనకు (IAF) చెందిన యుద్ధ విమానం 'తేజస్' (Tejas) కుప్పకూలిన ఘటన రాజస్థాన్ లోని జైసల్మేర్ (Jaisalmer) లో జరిగింది. శిక్షణా కార్యకలాపాల సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఓ హోటల్ కాంప్లెక్స్ సమీపంలో కూలిపోగా..  వెంటనే మంటలు చెలరేగగా.. అగ్నిమాపక సిబ్బంది తగు చర్యలు చేపట్టారు. అప్రమత్తమైన పైలట్ పారాచూట్ సాయంతో ముందుగానే బయటకు రావడంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు భారత వాయుసేన తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. కాగా, స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన యుద్ధ విమానాల్లో 'తేజస్' ఒకటి. 2016లో దీన్ని వాయుసేనలోకి చేర్చారు. 2001లో తొలి టెస్ట్ ఫ్లైట్ మొదలు కాగా.. తేజస్ కూలిపోవడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.

తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి..

సింగిల్ సీటర్ ఫైటర్ జెట్ 'తేజస్' (Tejas)ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 2016లో చేర్చారు. ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్ ను సైతం ఎయిర్ ఫోర్స్ తో పాటు ఇండియన్ నేవీలోనూ వినియోగిస్తున్నారు. ఈ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ 'తేజస్'.. 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. అఫెన్సివ్ ఎయిర్ సపోర్ట్ తీసుకునేలా, గ్రౌండ్ ఆపరేషన్స్ లో క్లోజ్ కంబాట్ సపోర్టును సమకూర్చేలా ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం భారత వాయుసేనలో 40 తేజస్ MK - 1 ఎయిర్ క్రాఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మరో 83 తేజస్ MK - 1 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనుగోలు కోసం ఐఏఎఫ్ ఆర్డర్ చేసింది. 2025 నాటికి పాత కాలపు మిగ్ - 21 ఎయిర్ క్రాఫ్ట్ ల స్థానంలో లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ 'తేజస్' మార్క్ - 1Aతో భర్తీ చేయాలని ఐఏఎఫ్ నిర్ణయించింది. 2001 జనవరి 4న తొలి తేజస్ ఫైటర్ జెట్ గాల్లోకి ఎగిరింది.

Also Read: Nayab Singh Saini: హరియాణాలో కొలువు దీరనున్న కొత్త ప్రభుత్వం - నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget