(Source: ECI/ABP News/ABP Majha)
Indian Railways Trains Cancelled: భారీ వర్షాల కారణంగా రద్దైన రైళ్లు ఇవే…
వారం రోజుల పాటు దంచికొట్టిన వానలతో జనజీవనం స్తంభించిపోయింది. ఊర్లు ఏర్ల ఏకమయ్యాయి. పలుచోట్ల రోడ్లు, రైల్వే ట్రాక్ లు చెరువులని తలపిస్తున్నాయి. తప్పని పరిస్థితిలో కొన్ని రైళ్లు రద్దుచేశారు అధికారులు.
నైరుతి రుతుపవనాల ప్రభావం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. మహారాష్ట్రలో ముంబై, రత్నగిరి, రాయగడ్, నాసిక్ ప్రాంతాల్లో భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీంతో ఇప్పటికే ముంబై/కొంకణ్ రీజియన్లలో 30 రైళ్లు రద్దుచేశారు. తాజాగా సెంట్రల్ రైల్వే పరిధిలోని ఇగత్ పురి-లోనావాలా, కొల్హాపూర్-మిరజ్ సెక్షల్ ల మధ్య కొండచరియలు విరిగి పడడంతో 14 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నామని చెప్పారు.
24-28తేదీల మధ్య నాలుగు రైళ్లు ఒక్కో రోజు, పది రైళ్లు నాలుగు రోజుల చొప్పున రద్దయ్యాయి. ఇతర రూట్లలో నడిచే ముంబయి-తిరువనంతపురం, 21, 22, 23 తేదీల్లో బయల్దేరిన వెరవల్-తిరువనంతపురం, చండీగఢ్-కొచ్చువేళి, హిస్సార్-కొయంబత్తూరుల మధ్య నడిచే రైళ్లను వర్షాల నేపథ్యంలో దారి మళ్లించి నడిపినట్లు రైల్వేశాఖ పేర్కొంది. 23న బయల్దేరాల్సిన తిరుపతి-కొల్హాపూర్, 26న బయల్దేరాల్సిన హౌరా-వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌లను రైల్వేశాఖ రద్దుచేసింది. 22, 23 తేదీల్లో బయల్దేరిన ఎర్నాకుళం-హజ్రత్ నిజాముద్దీన్, పోరుబందర్-కొచ్చువేళి, కేఎస్‌ఆర్ బెంగళూరు-అజ్మీర్ రైళ్లను దారి మళ్లించి నడిపించారు.
ఇక ముంబై/కొంకణ్ రీజియన్లలో భారీ వర్షాల కారణంగా 30 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించింది. 12 రైళ్ల రూట్‌ను డైవర్ట్ చేశామని, మరో 8 ట్రైన్స్‌ను చివరి స్టేషన్ వరకూ వెళ్లకుండా మార్గం సరిగా ఉన్న స్టేషన్లలో ప్రయాణం ముగించేలా మార్పులు చేశామని పేర్కొంది. వర్షం ఆగిన ప్రాంతాల్లో పట్టాలపై పేరుకునిపోయిన బురద, నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని చెప్పారు అధికారులు.
రత్నగిరి, రాయగడ్ జిల్లాల్లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికే వరద తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రివ్యూ నిర్వహించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు, పలు శాఖల ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలోృ….లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
కేవలం వారం రోజుల్లో భారీ వర్షాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడి 60 మంది మరణించారు. ఇప్పటికీ పలు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో సహాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. మరోవైపు వరద బాధిత రాష్ట్రాలకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు.
రద్దైన పలు రైళ్ల వివరాలిలా ఉన్నాయి...
ALSO READ: కేటీఆర్ చిన్నప్పుడు ఇలా ఉన్నారన్న మాట!