By: ABP Desam | Updated at : 20 Nov 2023 04:50 PM (IST)
సబ్‌మరైన్ సంఖ్య విషయంలో భారత్‌కి చైనా, పాకిస్థాన్ సవాల్ విసురుతున్నాయి. (Image Credits: PTI)
Indian Submarines Capacity:
చైనా పాకిస్థాన్ నేవల్ ప్యాట్రోల్..
హిందూ మహా సముద్రంలో (Indian Ocean) చైనా పాకిస్థాన్ జాయింట్ నావల్ డ్రిల్ అంతర్జాతీయంగా కొత్త చర్చకు దారి తీసింది. చైనాకి చెందిన సబ్‌మరైన్‌తో పాటు అత్యంత శక్తిమంతమైన వార్‌షిప్స్ ఈ డ్రిల్‌లో పాల్గొన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే చైనా ఓ రకంగా కావాలనే బలప్రదర్శన చేసింది. తమది చాలా పవర్‌ఫుల్ నేవీ అని హింట్ ఇచ్చింది. హిందూ మహా సముద్రంలో ఇండియన్ నేవీకి అది అథి పెద్ద సవాలు విసరనుంది. ఇప్పటికే ఇండియన్ నేవీ బలోపేతం అయింది. 2030 నాటికి మరింత బలం చేకూర్చుకోవాలని ప్లాన్ చేసుకుంది. అయినా...చైనా, పాకిస్థాన్‌ని అడ్డుకోవాలంటే భారీ సంఖ్యలో సబ్‌మరైన్‌లను సమకూర్చుకోవాల్సిన అసరముందంటున్నారు నిపుణులు. చైనా పాకిస్థాన్ నేవల్ ప్యాట్రోల్‌లో (Sino-Pakistan Naval Patrol) చైనా సబ్‌మరైన్‌ని (China Submarine) ప్రదర్శించడం పెద్ద చర్చకే దారి తీసింది. ఈ డ్రిల్‌ని మొదటి నుంచి గమనించిన భారత నేవీ ప్రస్తుతం తమకున్న బలాన్ని రివ్యూ చేసుకుంది. 2030 నాటికి సబ్‌మరైన్ కెపాసిటీని ఎలా పెంచుకోవాలో ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. ప్రస్తుతం పాకిస్థాన్ నేవీ వద్ద (Pakistan Navy) 5 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మరైన్స్‌తో పాటు మూడు మినీ సబ్‌మరైన్స్ ఉన్నాయి. భారత్ సామర్థ్యంతో పోల్చుకుంటే ఇది తక్కువే. కానీ...పాక్‌కి చైనా పెద్ద ఎత్తున సాయం చేస్తోంది. నేవీని బలపరుచుకునేందుకు సపోర్ట్ ఇస్తోంది. భారత్ ఫోకస్ పెంచాల్సి రావడానికి కారణం కూడా ఇదే.
పాతబడిన సబ్‌మరైన్స్..
అరేబియన్ సముద్రంలో చైనా పాకిస్థాన్‌నేవీతో కలిసి శాశ్వతంగా సబ్‌మరైన్‌ని డిప్లాయ్ చేసే అవకాశాలూ ఉన్నాయి. ప్రస్తుతం పాక్ వద్ద సబ్‌మరైన్స్ సంఖ్య ఈ దశాబ్దం ముగిసే నాటికి 13కి పెరిగే అవకాశాలున్నాయి. చైనా సహకారంతో వీటిని సమకూర్చుకోనుంది దాయాది. భారత్ త్వరలోనే మరో మూడు Scorpene-class అడ్వాన్స్‌డ్ డీజిల్ సబ్‌మరైన్స్‌ని సమకూర్చుకోనుంది. ఇండియన్ నేవీ 2030 నాటికి 24 జలాంతర్గాములను డిప్లాయ్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 6 న్యూక్లియర్ సబ్‌మరైన్స్ కూడా ఉన్నాయి. కానీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగా ఆ సంఖ్య పెంచుకోవడం సాధ్యమవుతుందా లేదా అన్నది స్పష్టత లేదు. ఇదే భారత్‌కి సవాలుగా మారింది. ప్రస్తుతం భారత్ వద్ద ఆరు Scorpene-class డీజిల్ సబ్‌మరైన్స్ ఉన్నాయి. P-75 ప్రోగ్రామ్‌లో భాగంగా వీటిని సమకూర్చుకుంది. కానీ వీటిలో సగం వరకూ పాతికేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చినవే. 80,90 దశకంలో సోవియట్స్ సప్లై చేసినవే ఇంకా వినియోగంలో ఉన్నాయి. వీటిలో INS Sindhudhwaj గతేడాదే సర్వీస్‌ల నుంచి తప్పుకుంది. మరో సబ్‌మరైన్ ప్రమాదానికి గురికాగా...మరోటి మయన్మార్‌కి కానుకగా ఇచ్చింది ఇండియన్ నేవీ. ఈ దశాబ్దం ముగిసే నాటికి అవి మరింత పాతబడిపోతాయి. వాటిని తప్పించడం తప్ప భారత్‌కి మరో ఆప్షన్ లేదు.
సంఖ్య తగ్గిపోతుందా..?
P-75-I ప్రోగ్రామ్‌లో భాగంగా భారత్‌లోనే ఆరు సబ్‌మరైన్స్‌ని తయారు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇండియన్ నేవీ. విదేశీ సంస్థల సహకారంతో దేశీయంగానే తయారు చేయాలని భావిస్తోంది. అయితే...దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఆ జాప్యం కారణంగా సబ్‌మరైన్స్ సంఖ్య పెంచుకోవడంలో ఆలస్యమవుతుందన్నది నిపుణుల వాదన. మరి కొద్ది నెలల్లోనే ఇవి ఆర్డర్ పెడితే తప్ప ఈ దశాబ్దం ముగిసే నాటికి అవి అందుబాటులోకి రావు. ఇక న్యూక్లియర్ సబ్‌మరైన్స్ విషయానికొస్తే..ఇప్పటి వరకూ నేవీ ఏమీ ఆర్డర్ చేయలేదు. Arihant-class న్యూక్లియర్ సబ్‌మరైన్ ప్రస్తుతం సేవలందిస్తోంది. INS Arighat ట్రయల్స్‌లో ఉంది. మూడో సబ్‌మరైన్‌కి ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే... INS Arighat వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముంది. INS Chakra-1 న్యూక్లియర్ సబ్‌మరైన్‌ని రష్యా నుంచి పదేళ్ల పాటు లీజ్‌కి తీసుకుంది భారత్. INS Chakra-2 సబ్‌మరైన్‌ని గతేడాదే రష్యాకి తిరిగి పంపింది. మరో న్యూక్లియర్ సబ్‌మరైన్‌ని లీజ్‌కి తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నా...ఇంకా ఇది ఫైనల్ కాలేదు. ఈ లెక్కన చూస్తే ఈ దశాబ్దం చివరి నాటికి భారత్ నేవీలో సబ్‌మరైన్‌ల సంఖ్య 14కి తగ్గిపోనుంది.
Also Read: Uttarkashi Tunnel Rescue: ఉత్తరాఖండ్ సీఎంకి ప్రధాని మోదీ ఫోన్ కాల్, రెస్క్యూ ఆపరేషన్‌పై ఆరా
Election Results 2023: కాంగ్రెస్ ఓటమి I.N.D.I.A కూటమిపై ప్రభావం చూపుతుందా? వ్యూహాలు మారతాయా?
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
Election Results 2023: డిసెంబర్ 6న ఖర్గే నివాసంలో I.N.D.I.A కూటమి కీలక భేటీ, ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్!
Election Results 2023: వచ్చేది ఒకటి, పోయేది మూడు - నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఫ్యూచర్ ఇదేనా?
Chhattisgarh Election Result 2023: ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు, కాంగ్రెస్‌ని వెనక్కినెట్టి దూసుకుపోతున్న బీజేపీ
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
/body>