Gyanvapi Case: జ్ఞానవాపి సర్వేకు ఇంకో 8 వారాలు కావాలన్న ASI- విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా
జ్ఞానవాపీ మసీదులో సర్వే నిర్వహింస్తున్న భారత పురావస్తు శాఖ ASI... సర్వే పూర్తి చేయడానికి మరో ఎనిమిది వారాలు గడుపు కోరింది. దీనిపై విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా వేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ శాస్త్రీయ సర్వే చేస్తోంది. మసీదులో తవ్వకాలు జరపకుండా, కట్టడానికి హాని కలిగించని రీతిలో సర్వే చేయాలనే షరతుతో సర్వేకు అనుమతి ఇచ్చింది కోర్టు. అయితే సర్వే కోసం కోర్టు ఇచ్చిన గడువు నేటి ముగిసింది. దీంతో... సర్వే పూర్తిచేయడానికి ఇంకా 8వారాల సమయం కావాలంటూ జిల్లా జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా జడ్జి ఏకే విశ్వేష్ సెలవులో ఉన్నందున, ఇన్‌ఛార్జ్ జిల్లా జడ్జి సంజీవ్ సిన్హా ఈ కేసుపై తదుపరి విచారణను సెప్టెంబర్ 8వ తేదికి వాయిదా వేశారు.
జ్ఞానవాపి 17వ శతాబ్దపు మసీదు.. అయితే, అంతుకు ముందే... అక్కడ హిందూ దేవాలయం యొక్క ఆనవాళ్లు ఉన్నాయా? వాటిపైనే మసీదు నిర్మించబడిందా లేదా అనేది నిర్దారించడనాకి ASI సర్వేని అనుమతించిన అలహాబాద్ హైకోర్టు. కోర్టు ఆదేశాల ప్రకారం.. కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని ఉన్న కాంప్లెక్స్‌పై ఆగస్టు 4న శాస్త్రీయ సర్వే ప్రారంభమైంది. నాలుగు వారాలుగా జరుగుతున్న సర్వేకు కోర్టు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగిసింది. అయితే, సర్వే ఇంకా పూర్తికాకపోవడంతో.. ఇంకా సమయం కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. కనీసం 8వారాల సమయం పడుతుందని తెలపారు. హిందూ తరపు న్యాయవాది.. విష్ణు శంకర్ జైన్ కూడా.. సర్వే ఇంకా అసంపూర్తిగా ఉందని.. ప్రాథమిక నివేదిక సమర్పించడానికి ASIకి మరింత సమయం ఇవ్వాలని సూచించారు. హిందూ తరపు మరో న్యాయవాది సుధీర్ త్రిపాఠి కూడా సర్వే ఇంకా పూర్తికాలేదని చెప్పారు. సర్వే పూర్తికాకుండా ఇచ్చే నివేదిక ఇచ్చినా... అది అసంపూర్తిగానే ఉంటుందని.. కనుక.. ASI సూచన మేరకు సమయం ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.
జ్ఞానవాపి మసీదు గోడకు హిందూ దేవుళ్ల చిత్రాలున్నాయని, వాటికి పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ వారణాసి కోర్టులో నలుగురు మహిళలు పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. మసీదులో పురావస్తు సర్వే నిర్వహించాలని వారణాసి జిల్లా కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ అలహాబాద్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన అలహాబాద్ కోర్టు.. కింది కోర్టు తీర్పును సమర్థించి. జ్ఞానవాపి మసీదులో సర్వేకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సర్వే వల్ల మసీదు నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లకూడదని తెలిపింది. ఆగస్టు 3న కోర్టు అనుమతి ఇవ్వడంతో... ఆగస్టు 4 నుంచి ASI సర్వే జరుగుతోంది. అయితే.. సర్వే ఇంకా పూర్తికాకపోవడంతో సమయంలో కోరుతూ కోర్టును అభ్యర్థిచంది ASI. కేసు విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా పడింది. అయితే.. సర్వేకు సమయం పెంచుతారా..? లేదా అన్న తేలాల్సి ఉంది.