UAN Activation Deadline Extended Date: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. యూఏఎన్ యాక్టివేషన్ గడువు పెంపు
UAN Activation Deadline Extended: పీఎఫ్ అకౌంట్లతో యూఏఎన్ యాక్టివేషన్ చేసుకునే గడువును తాజాగా ఈపీఎఫ్ఓ పొడగించింది. అలాగే బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేసుకునే తేదీని కూడా ప్రభుత్వం పెంచింది.
UAN Activation Deadline Extended: ది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఈపీఎఫ్ఓ) సంస్థ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ద ఎంప్లాయ్ లింక్డ్ఇన్సెంటివ్ (ఈఎల్ఐ)తో యూనివర్సల్ యాక్టివేషన్ నెంబర్ (యూఏఎన్) నెంబర్ ను లింక్ చేసుకోవడానికి ఉన్న గడువును తాజాగా పోడగించింది. నిజానికి ఈ గడువు గతనెల 30వ తేదిన పూర్తవగా.. తాజాగా దీన్ని డిసెంబర్ 15 వరకు పొడగించింది. తాజాగా ఇందుకు సంబంధించిన సమచారాన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ లో పొందురిచింది. ఇందుకు సంబంధించిన సర్క్యూలర్ ను తాజాగా విడుదల చేసింది. అలాగే బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ సీడింగ్ గడువును కూడా ప్రభుత్వం పొడగించింది.
ట్వీట్ లో ఏంముందంటే..
ప్రియమైన ఉద్యోగులరా.. యూఏఎన్ యాక్టివేషన్ , బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ గడువులను ఈనెల 15 వరకు పొడగించామని ఈఫీఎఫ్ఓ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగంలో చేరిన వారు కచ్చితంగా యాక్టివేషన్, సీడింగ్ ను చేసుకోవాలని, దీంతో ఈఎల్ ఐ ప్రయోజనాలను పొందేందుకు వీలుంటందని గుర్తు చేసింది. మరోవైపు ఈ గడుపు పెంపు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈఎల్ ఐ పథకంకి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.
అసలు ఈ ఈఎల్ఐ స్కీమ్ ఏంటి..?
2024 కేంద్ర బడ్జెట్లలో ఈఎల్ఐని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పథకం ద్వారా ఉద్యోగుల ఆధార్ తో అనుసందానం చేయబడిన బ్యాంకు అకౌంట్లకు నేరుగా నగదు బదిలీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో మూడు రకాల స్కీములు ఉంటాయని, అవి ఏ,బీ,సీ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ లో పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓలో తొలిసారి చేరిన ఉద్యోగులకు ఏ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఇక ఉద్యోగ కల్పనకు స్కీమ్ బీ, ఉద్యోగులకు మద్ధతుగా నిలిచేందుకు స్కీమ్ సీ తోడ్పాటు అందిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
మూడు స్కీముల వివరాలు..
స్కీమ్ ఏలో భాగంగా అన్నిరకాల సెక్టార్లలో జాయిన్ అయిన ఉద్యోగులకు ఒక నెల వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బ్యాంక్ అకౌంట్లకు మూడు విడుతలుగా ఈ చెల్లింపులు చేస్తారు. ఇందులో ఒక లక్ష వేతనం వరకు ఉన్న ఉద్యోగులకు, ఈపీఎఫ్ ఓ లో జాయిన్ అయిన వారు అర్హులు.
ఇక స్కీమ్ బీలో భాగంగా తయారీ రంగంలో అదనపు ఉద్యోగాల కల్పనను ప్రభుత్వం కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో తొలి నాలుగు సంవత్సరాలకు సంబందించి ఉద్యోగులకు, కంపెనీలకు ప్రభుత్వం ప్రయోజనాలు అందిస్తుంది.
ఇక స్కీమ్ సీలో భాగంగా ఎక్కువగా కంపెనీలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. అన్ని రకాల సెక్టార్లలో ఉద్యోగాల కల్పనకు కంపెనీలకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. రెండు సంవత్సరాల వరకు ఒక్కో ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్ కంట్రిబ్యూషన్ ను ప్రభుత్వమే చెల్లించనుంది. దీన్ని నెలకు మూడు వేల రూపాయలకు పరిమితి చేశారు. దాదాపు నెలకు రూ.లక్ష వరకు వేతనం ఉన్న ఉద్యోగులు ఈ కేటగిరీలోకి వస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Also Read: పన్ను ఆదా చేయాలంటే ఈ నెలాఖరులోగా సీరియస్‌గా ఆలోచించాల్సిన ఆప్షన్స్ ఇవి