News
News
X

Ban on Plastic Straws: డ్రింక్స్ కంపెనీల గొంతులో " ప్లాస్టిక్ స్ట్రా " - బయట పడటమెలా ?

జూలై ఒకటి నుంచి ప్లాస్టిక్ స్ట్రాలు వాడవద్దని కేంద్రం ఆదేశించింది. పేపర్ స్ట్రాలే వాడాలని తెలిపింది. అయితే ఇలా చేస్తే నష్టపోతామని ఏడాది పాటు గడువు పొడిగించాలని కంపెనీలు కోరుతున్నాయి.

FOLLOW US: 
Share:

Ban on Plastic Straws:  ప్లాస్టిక్ స్ట్రాలు జూలై ఒకటో తేదీ నుంచి కనిపించకూడదు. వాటి ఉత్పత్తిపై కేంద్రం నిషేధం విధించింది.   మజ్జిగ, లస్సీ వంటి పాల ఉత్పత్తులను, పళ్ల రసాలను టెట్రా ప్యాకెట్లలో అందజేసే సంస్థలు వాటితో పాటు చిన్న ప్లాస్టిక్‌ స్ట్రాలు కూడా అందిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ స్ట్రాలపై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ప్లాస్టిక్‌ స్ట్రాల స్థానంలో కాగితం స్ట్రాలు వాడాలని సూచించింది. జులై ఒకటో తేదీ నుంచే నిషేదం అమల్లోకి వస్తుందని కూడా పేర్కొంది. ఇలాంటి స్ట్రాలు లేకుండా ఆయా ద్రవరూప ఉత్పత్తులను అమ్మడం సాధ్యం కాదు. అలాగని ఇప్పటికిప్పుడు పేపర్ స్ట్రాలను ఉత్పత్తి చేసి వినియోగించేందుకు కంపెనీలకు మౌలిక సదుపాయాలు లేవు. 

ప్లాస్టిక్ స్ట్రాలు మరో ఏడాది ఉండాలన్న అమూల్

కేంద్రం ఎటువంటి సంప్రదింపులు జరపకుండా తీసుకున్న ఈ నిర్ణయం పాడి రైతులపైనా, పాల ఉత్పత్తుల వినియోగాదారులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని కంపెనీలు చెబుతున్నాయి. నిషేధం నిర్ణయాన్ని మరో ఏడాది పాటు వాయిదా వేయాలనికోరుతున్నాయి. గుజరాత్‌కు చెందిన  పాల ఉత్పత్తిదారుల సహకార సంస్థ 'అమూల్‌' కూడా కేంద్రానికి ఇదే విజ్ఞప్తి చేసింది.  తక్షణమే స్ట్రాలను నిషేదించడం వల్ల రైౖతులు, పాల వినియోగదారులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

నష్టపోతామని కూల్ డ్రింక్ కంపెనీల ఆందోళన

పళ్ల రసాల చిన్న ప్యాకెట్లు, ఇతర డెయిరీ ఉత్పత్తుల ప్యాకింగ్‌లపై ఈ నిర్ణయం పెను ప్రభావం చూపుతుందన్నారు. శీతల పానీయాల సంస్థలు పెప్సీ, కోకాకోలా కంపెనీలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే నిషేదం అమల్లోకి వస్తే తీవ్రంగా నష్టపోనున్నట్టు తెలిపాయి. కంపెనీలు తామ నష్టపోతామని చెప్పడంలేదు. రైతులు నష్టపోతాయని చెప్పడం ద్వారా కేంద్రాన్ని ఆలోచనలో పడేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

గడువు పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తులు
 
కూల్‌ డ్రింక్‌ సంస్థలైన పెప్సీ, కోకాకోలా కంపెనీలు కూడా కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ఆందోళ‌న‌ వ్య‌క్తం చేశాయి. వెంటనే ప్లాస్టిక్‌ స్ట్రాలను బ్యాన్‌ చేస్తే తీవ్రంగా నష్టపోనున్నట్టు తెలిపాయి. ఇ ప్లాస్టిక్ స్ట్రాల స్థానంలో పేపర్ స్ట్రాలను వినియోగించాలని కేంద్రం ఇది వరకే సూచించింది. కానీ అందుకే ఈ కంపెనీలు సిద్ధం కాలేదు. గుడువు ముంచుకొస్తూండటంతో అదనపు సమయం కోసం అర్థిస్తున్నాయి. గతంలో  కార్లలో ఖచ్చితంగా ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ఉండాలని కేంద్రం నింబంధన తెచ్చింది. ఈ నిబంధన కూడా అమలు చేయలేమని వాయిదా వేయాలని కార్ల కంపెనీలు కారు. ఇప్పుడు స్ట్రాలు కూడా మార్చలేమన కంపెనీలు చెబుతున్నాయి. 

Published at : 10 Jun 2022 05:16 PM (IST) Tags: Cool drink‌ milk dairy products ban on plastic straws plastic straws

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: సత్తెనపల్లి రామకృష్ణపురం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 100 మంది బాలికలకు అస్వస్థత 

Breaking News Live Telugu Updates: సత్తెనపల్లి రామకృష్ణపురం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 100 మంది బాలికలకు అస్వస్థత 

BBC Documentary: ఈ పిటిషన్‌ల వల్లే సుప్రీంకోర్టు సమయం వృథా అవుతుంది - డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర మంత్రి అసహనం

BBC Documentary: ఈ పిటిషన్‌ల వల్లే సుప్రీంకోర్టు సమయం వృథా అవుతుంది - డాక్యుమెంటరీ వివాదంపై కేంద్ర మంత్రి అసహనం

Bihar Politics: చావనైనా చస్తాం కానీ బీజేపీతో పొత్తు మాత్రం పెట్టుకోం - బిహార్ సీఎం నితీష్ కుమార్

Bihar Politics: చావనైనా చస్తాం కానీ బీజేపీతో పొత్తు మాత్రం పెట్టుకోం - బిహార్ సీఎం నితీష్ కుమార్

Bharat Jodo Yatra: నడవడం తేలికే అనుకున్నా, ఆ చిన్నారి నా ఇగోని పోగొట్టింది - రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra: నడవడం తేలికే అనుకున్నా, ఆ చిన్నారి నా ఇగోని పోగొట్టింది - రాహుల్ గాంధీ

Nithish Kumar: కేసీఆర్ సభకు నితీష్ కుమార్ రావట్లేదట - బీఆర్ఎస్‌తో స్నేహంపై కూడా క్లారిటీ!

Nithish Kumar: కేసీఆర్ సభకు నితీష్ కుమార్ రావట్లేదట - బీఆర్ఎస్‌తో స్నేహంపై కూడా క్లారిటీ!

టాప్ స్టోరీస్

టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక

Adani vs Hindenburg: ₹14 లక్షల కోట్ల నష్టం మిగిల్చిన 32 వేల పదాల నివేదిక

Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ - అంచనాలను మించిపోయిన‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?

Dasara Teaser: నాని నెవ్వర్ బిఫోర్ -  అంచనాలను మించిపోయిన‘దసరా’ టీజర్ - ఎలా ఉందో చూశారా?

Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి

Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి