By: ABP Desam | Updated at : 03 Jun 2023 07:02 AM (IST)
బారులు తీరిన ప్రయాణికులు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం (జూన్ 2) ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతి చెందగా, 900 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో రైలులో ఉన్న ప్రయాణికులు ఈ ప్రమాదం జరిగిన భయానక దృశ్యాన్ని వివరించారు.
ప్రమాదం జరిగిన సమయంలో తాను నిద్రిస్తున్నానని ఓ ప్రయాణికుడు మీడియాకు తెలిపాడు. రైలు బోల్తా పడగానే ఒక్కసారిగా కళ్లు తెరిచి చూశాను. అప్పటికే నాపై 10-15 మంది పడి ఉన్నారు. వారి మధ్యలో నేను ఇరుక్కుపోయాని. నా చేతులు, కాళ్ళకు గాయాలు అయ్యాయి. ఆ తర్వాత ఎలాగోలా వారిని నెట్టుకొని బయటకు వచ్చాను. అక్కడ చూస్తే నాకు భయానక దృశ్యాలు కనిపించాయి. చాలా మంది శవాలపై పడి ఉన్నారు. ఒకరి చేతిని కోల్పోయి రోధిస్తున్‌నారు. మరొకరి కాలు పూర్తిగా చితికిపోయింది. తలచుకుంటే భయమేస్తోంది. "
నష్టపరిహారం ప్రకటించిన రైల్వే మంత్రి
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఇతర నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు నష్టపరిహారం ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు. అక్కడ 600-700 రెస్క్యూ బలగాలు పనిచేస్తున్నాయి. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగుతాయి. క్షతగాత్రులను రక్షించి వారికి చికిత్స అందించడమే మా ప్రాధాన్యత.
ఈ ప్రమాదం ఎలా జరిగింది?
హౌరా వెళ్తున్న 12864 బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు చెందిన పలు బోగీలు బహంగా బజార్ వద్ద పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పిన బోగీలు 12841 షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను ఢీకొనడంతో దాని బోగీలు కూడా బోల్తా పడ్డాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు పట్టాలు తప్పడంతో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది.
ప్రమాదం కారణంగా చాలా రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లించింది. మరికొన్నింటిని రద్దు చేసింది. ఆ రైళ్ల జాబితాను కూడా విడుదల చేసింది.
దారి మళ్లించిన రైళ్ల జాబితా ఇలా ఉంది.
రైలు నెంబర్ 22807 టాటా జంషెడ్ పూర్ మీదుగా వెళ్తుంది.
రైలు నెంబర్ 22873 కూడా టాటా జంషెడ్ పూర్ మీదుగా వెళ్తుంది.
రైలు నెంబర్ 18409ను టాటా జంషెడ్ పూర్ వైపు మళ్లించారు.
రైలు నెంబర్ 22817ను కూడా టాటా వైపు మళ్లించారు.
రైలు నెంబర్ 15929ను తిరిగి భద్రక్ కు పిలిపించారు.
12840 చెన్నై సెంట్రల్-హౌరా ప్రస్తుతం ఖరగ్ పూర్ డివిజన్ లోని జరోలి గుండా నడుస్తుంది.
18048 వాస్కోడిగామా - షాలిమార్ కటక్, సల్గావ్, అంగుల్ మీదుగా దారి మళ్లించబడింది.
సికింద్రాబాద్-షాలిమార్ (22850) వీక్లీ రైళ్లను కటక్, సల్గావ్, అంగుల్ మీదుగా మళ్లిస్తారు.
రద్దయిన రైళ్ల జాబితా ఇలా ఉంది.
రైలు నెంబర్ 12837 హౌరాపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు. అలాగే రైలు నెంబర్ 12863 హౌరా-ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్ప్రెస్ను కూడా రద్దు చేశారు. రైలు నెంబర్ 12839 హౌరా-చెన్నై సెంట్రల్ మెయిల్, 12895, 20831, 02837 రైళ్లను కూడా రద్దు చేశారు.
CHSL 2023: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌లో పెరిగిన పోస్టుల సంఖ్య - ఎన్నంటే?
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
UPSC NDA Results 2023: యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ-2 2023 రాతపరీక్ష ఫలితాలు విడుదల, ఇలా చూసుకోండి!
Ayodhya Ram Temple: జనవరి 22న అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ, ఆలయం ఎప్పటికి పూర్తవుతుందంటే?
Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు- ఇద్దరు మహిళలు, ఓ మైనర్ సహా ఆరుగురు అరెస్టు
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?
/body>