అన్వేషించండి

Maharashtra Political Crisis: మరింత ముదిరిన మహా సంక్షోభం- అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయిన ఉద్దవ్ ఠాక్రే

అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఎవరైనా నన్ను సీఎంగా వద్దు అని చెబితే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. అధికారిక నివాసాన్ని వదిలివేస్తాను అని థాకరే అన్నారు.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింతగా ముదిరినట్టే కనిపిస్తోంది. రెబల్ ఎమ్మెల్యేలు కోరుకుంటే తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించిన ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అధికారిక నివాసం వర్ష బంగ్లాను విడిచిపెట్టి తన వ్యక్తిగత నివాసం మాతోశ్రీకి చేరుకున్నారు.  

సాయంత్రం ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన ఉద్దవ్ ఠాక్రే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనకు సీఎం పదవిపై ఆశ లేదని, రాజీనామాకు సిద్ధమని చెప్పారు. ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయడం ద్వారా ఉద్ధవ్ తన మద్దతుదారులకు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి పదవిని ఆశించడం లేదన్న సంకేతాలను ఇచ్చారు. 

శివసేన సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంపై సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి.  ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఏకనాథ్ 34 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖ రాశారు.

దీని తర్వాత, ఉద్ధవ్ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా మహారాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. తన ఎమ్మెల్యేలు పదవిలో కొనసాగ వద్దని కోరుకుంటే రాజీనామాకు సిద్ధమని చెప్పారు. సీఎం నివాసాన్ని కూడా విడిచిపెట్టేందుకు సిద్ధమని ఉద్ధవ్‌ చెప్పారు.

మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా బుధవారం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమై శివసేన తిరుగుబాటుదారుడు ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేయమని సలహా ఇచ్చారని ఏబీపీ న్యూస్‌కి  పార్టీ వర్గాలు తెలిపాయి.
 
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామాలు
1. శివసేన సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే బుధవారం ఉదయం సూరత్ నుంతి గౌహతి చేరుకున్నారు. పార్టీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు అసోం చేరుకున్నారని ఏఎన్‌ఐ తెలిపింది. తామంతా బాలాసాహెబ్ థాకరే హిందుత్వ అజెండా ఎత్తుకున్నామని చెప్పినట్టు గౌహతి చేరుకున్న తర్వాత షిండే అన్నారు.

శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య కూటమిగా ఏర్పడిన మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో, ఇతర శివసేన ఎమ్మెల్యేలతో కలిసి షిండే భారతీయ జనతా పార్టీలో చేరారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ రెబల్‌ ఎమ్మెల్యేలను  అసోంలోని బిజెపి ఎమ్మెల్యే సుషానాతా బోర్గోహైన్ రిసీవ్ చేసుకున్నారు. 

2. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ఏక్నాథ్ షిండేకు మద్దతుగా ఉన్న తిరుగుబాటు పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నాయని, "తాము అధికారం కోల్పోవచ్చు, అయితే మేము పోరాటం కొనసాగిస్తామని" వార్తా సంస్థ ANIకు తెలిపారు. విలేకరులతో రౌత్ మాట్లాడుతూ, “ఏక్‌నాథ్ షిండేతో ఉన్న ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నాయి, అందరూ శివసేనలోనే ఉంటారు. కానీ మనలో చాలా మంది అధికారాన్ని కోల్పోవచ్చు కానీ మేము పోరాడుతూనే ఉంటామని అన్నారు. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ షిండే గురించి రౌత్ మాట్లాడుతూ, “ఏక్నాథ్ షిండే మా పార్టీ సీనియర్‌ లీడర్‌, మా స్నేహితుడు, దశాబ్దాలుగా కలిసి పని చేస్తున్నాము. ఒకరినొకరు విడిచిపెట్టడం ఇద్దరికీ అంత సులభం కాదు. ఉదయం ఆయనతో గంటసేపు మాట్లాడాను, పార్టీ అధినేతకు దాని గురించి తెలియజేశాను.  

3. ఉద్ధవ్‌కు బుధవారం కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ తెలిపారు. శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు, ఉద్ధవ్ ఠాక్రే,  అతని పార్టీ గందరగోళంలో ఉన్న తరుణంలో  గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి వైరస్ సోకినట్లు తెలిసిన కొన్ని గంటలకే సీఎంకు కరోనా అని తెలిసింది. 

రాజకీయ సంక్షోభం తరువాత షిండే గవర్నర్ కోషియారీని కలవాలని భావించారు, అయితే కరోనా పాజిటివ్ అని తెలిసిన  తర్వాత కలవలేదు. ప్రస్తుతం గవర్నర్ ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్‌లో చేరి చికిత్స పొందుతున్నారు.

4. తిరుగుబాటు చేసిన శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండేతోపాటు ఉన్న ఎమ్మెల్యే ఒకరు బుధవారం నాగ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. తనను "కిడ్నాప్" చేశారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని బాలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నితిన్ దేశ్‌ముఖ్, తాను ఉద్ధవ్ ఠాక్రే, బాలాసాహెబ్ ఠాక్రే  శివసైనికుడని అన్నారు.

"100-150 మంది పోలీసులు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నేను దాడికి గురైనట్లు నటించాను. వారు నాకు ఆపరేషన్ చేయాలనుకున్నారు. ఆ నెపంతో నాకు హాని చేయాలనుకున్నారు. దేవుడి దయతో, నేను క్షేమంగా ఉన్నాను. నేను ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్నాను" అని దేశ్‌ముఖ్ విలేకరులతో అన్నారు. అతను బుధవారం సాయంత్రం సూరత్ నుంచి నాగ్‌పూర్‌కు తిరిగి వచ్చాడు.

5. బుధవారం సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యే వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్టు పరిగణిస్తామని పేర్కొంటూ శివసేన పార్టీ ఎమ్మెల్యేలకు లేఖ జారీ చేసినట్లు వార్తా సంస్థ ANI చెప్పింది. దీంతో అలర్ట్‌ అయిన షిండే... శివసేన ఇచ్చే విప్ చెల్లదని అన్నారు. శివసేన ఎమ్మెల్యే భరత్ గోగావాలేను పార్టీ శాసనసభాపక్ష ప్రధాన ప్రతినిధిగా నియమించినట్లు షిండే తెలిపారు.

6. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం పతనం అంచున ఉందన్న ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, ఉద్ధవ్ బుధవారం తన మౌనాన్ని వీడారు మరియు తన రాజీనామా వాదనలను ఖండించారు. ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో ప్రజలను ఉద్దేశించి సిఎం థాకరే మాట్లాడుతూ, పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఒకరు కోరుకున్నప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఎవరైనా నన్ను సీఎంగా వద్దు అని చెబితే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను. అధికారిక నివాసాన్ని వదిలివేస్తాను అని థాకరే అన్నారు.

7. NCP అధ్యక్షుడు శరద్ పవార్ ఉద్ధవ్‌ను కలుసుకుని, తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేయమని సలహా ఇచ్చారని వర్గాలు ABP న్యూస్‌కి తెలిపాయి. పవార్‌తోపాటు ఆయన కుమార్తె, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే, పార్టీ మంత్రి జితేంద్ర అవద్‌తో కలిసి దాదాపు గంటపాటు సమావేశం జరిగింది.

ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రజలను ఉద్దేశించి థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపాదించిన నిమిషాల తర్వాత ఈ సమావేశం జరిగింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేలకు ఆలివ్ శాఖను విస్తరింపజేసిన థాకరే, తన తర్వాత ఒక శివసైనికుడు ముఖ్యమంత్రిగా వస్తే తాను సంతోషిస్తానని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త
Tirumala Brahmotsavalu 2024: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, Photo చూశారా
Ola Offer: రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్ - అద్భుతమైన ఆఫర్ ఇస్తున్న ఓలా!
Telangana News: కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
కేటీఆర్ పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆత్రం సుగుణక్క
Jio Best 5G Plan: జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
జియో చవకైన 5జీ ప్లాన్ - రూ.200 లోపే అన్‌లిమిటెడ్ డేటా!
Raashi Khanna : గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
గ్రే సూట్​లో హాట్​ ఫోటోషూట్ చేసిన రాశీ ఖన్నా.. స్టైలిష్​ లుక్స్​ చూశారా?
Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!
Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్​బుక్, వాట్సాప్​ల​లో ఇవి షేర్ చేసేయండి
Embed widget